ప్రతాప్ కె పోతన్ తో రాధిక విడాకుల వెనక ఇంత కథ జరిగిందా ?

సీనియర్ నటుడు దర్శకుడు ప్రతాప్ కె పోతన్ మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్రమైన శోకసంద్రంలో మునిగిపోయింది.చెన్నైలోని తన సొంత నివాసంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.

 Divorce Story Between Radhika And Prathap K Pothan Details, Radhika, Actress Rad-TeluguStop.com

చెన్నైలో తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించినా మలయాళ చిత్ర పరిశ్రమంలోనే ప్రతాప్ తనదైన ముద్ర వేసుకున్నారు.నటుడిగా దర్శకుడిగా ఆయన అభిమానులను సంపాదించుకున్న ప్రతాప్ 70 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచారు.

ప్రతాప్ సినిమా జీవితం కన్నా వ్యక్తిగత విషయం జీవితం ఎక్కువగా వివాదాల పాలైంది.రాధికతో తన వివాహం తర్వాత తన జీవితం అనేక ఒడిదుడుకులకు కూడా లోనైంది.

రాధికతో కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి 1985లో పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరూ తమ పెళ్లి సమయానికి కెరియర్లో స్టార్ హోదాలో ఫుల్ బిజీగా ఉన్నారు.

రాధిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. `మీందుమ్‌ ఓరు కాతల్‌ కథై` అనే ఒక తమిళ సినిమా షూటింగ్ వీరి ఇరువురు మనుసులు కలిసాయి.

ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.కానీ పెళ్లి చేసుకున్న సరిగ్గా ఏడాదికి వీరి ఇరువురు విడాకులు తీసుకోవడం అప్పట్లో తమిళనాడు లో సంచలనం సృష్టించింది.ప్రేమించుకున్న సమయంలో వీరి మనసులైతే కలిసాయి కానీ పెళ్లి తర్వాత ఒకరిపై ఒకరికి తీవ్రమైన అయిష్టం ఏర్పడింది.రాధిక ఎక్కడ కూడా తన మొదటి పెళ్లి గురించి కానీ ప్రతాప్ గురించి కానీ మాట్లాడలేదు కానీ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రతాప్ నీ తీవ్రంగా సాధించింది అనేది మాత్రం తమిళ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.

ప్రతాప్ కెరీర్ పరంగా డౌన్ అవ్వడానికి అలాగే అతనికి సరైన అవకాశాలు రాకుండా రాధిక చేసింది అనేది ఒక పుకారు అప్పట్లో షికారు చేసింది.బయటకు మాట్లాడకపోయినా ప్రతాప్ అంటే రాధిక మండిపడేదట.

Telugu Pratap Poten, Actress Radhika, Cardiac, Kollywood, Prathap Pothan, Radhik

అతడు ఒక మూడి అని, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని, అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదని, తాగి ఏం చేస్తాడో తనకే తెలియదని రాధికా పలు సందర్భాల్లో తన సన్నిహితులతో చెప్పి వాపోయేదట.ప్రతాప్ కున్నాళ్ల తర్వాత ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి రాధికకు పొగరని, మంచిది కాదు అంటూ సంచలన విషయాలు చెప్పాడు.ప్రతాప్ ఆ తర్వాత మరొక పెళ్లి చేసుకున్నాడు అలాగే రాధిక రెండు పెళ్లిళ్లు చేసుకుంది.ఏది ఏమైనా వీరిద్దరు పెళ్లి అలాగే పెటాకులు కూడా అప్పట్లో తీవ్ర సంచలనమైన విషయాలు.1952న ఆగస్టు 13న కేరళలో జన్మించిన ప్రతాప్ స్క్రిప్ట్ రైటర్ గా, విషకుడిగా నిర్మాతగా ఆడ్ ఫిలిం మేకర్ గా నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రపంచానికి చాటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube