మెగా ఇంట్లో తొందరలోనే పెళ్లి భాజలు మోగబోతున్నాయి.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
అయితే వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా ఏకంగా నిశ్చితార్థం అంటూ అందరికీ షాక్ ఇచ్చారు ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే వీరి పెళ్లి పనులలో ఇరువురి కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.
ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతుంది అని తెలుస్తుంది.
వరుణ్ తేజ్ లావణ్య వివాహం వచ్చే నెల మొదట్లో జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా వీరి పెళ్లి తేదీ గురించి ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు.
ఇక లావణ్య త్రిపాటి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుందనే విషయం తెలియడంతో వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి తన ఆడపడుచు అయినటువంటి నిహారిక(Niharika) విషయంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

వరుణ్ తేజ్ సోదరి నిహారిక ఇదివరకే పెళ్లి చేసుకొని తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) అనే వ్యక్తిని నిహారిక ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.అయితే వీరి పెళ్లి జరిగినటువంటి రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్నటువంటి నిహారిక నాగబాబు ఇంట్లోనే ఉంటున్నారు.ఇక త్వరలోనే లావణ్య త్రిపాటి ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఆడపడుచు పై తన పెత్తనం చెలాయిస్తోందని తెలుస్తోంది.

తాజాగా లావణ్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమె తన పెళ్లి విషయంలో నిహారికకు వార్నింగ్ ఇచ్చారట.నిహారిక నువ్వు కనుక ఇలా చేస్తే నా పెళ్లికి అసలు రావద్దు అంటూ ఆమె తనకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.
అసలు నిహారికకు లావణ్య వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే నిహారిక ఇది వరకే పెళ్లి చేసుకొని విడాకులు( Divorce ) తీసుకుంది.ఇక మెగా కుటుంబం అంటే తమ కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లికి హాజరవుతారు.
ఈ పెళ్లి వేడుకలలో నిహారిక సందడి చేస్తే కనుక తన భర్త నుంచి ఆమె ఎందుకు విడాకులు తీసుకుందనే ప్రశ్న అందరూ అడుగుతారు అంటూ దానికి తానేమి సమాధానం చెప్పాలి అని తన తల్లి వద్ద బాగా ఏడ్చిందట.

ఇలా నిహారిక ఏడవడంతో ఆ విషయం లావణ్యకు తెలిసి లావణ్య నిహారికకు వార్నింగ్ ఇచ్చారట నువ్వు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ కనుక ఉంటే అసలు పెళ్లికే రావద్దని మా పెళ్లిలో నువ్వు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండేలాగా ఉంటేనే పెళ్లికి రా అంటూ నిహారికపై తనకు ఉన్నటువంటి ఇష్టాన్ని ప్రేమను ఇలా బయటపెట్టారని తెలుస్తుంది.ఇక లావణ్య వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి విషయంలో నిహారిక పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పాలి.ఇక లావణ్య కూడా నిహారికను సొంత చెల్లిలాగే చూసుకుంటుందని నిహారిక విషయంలో లావణ్య చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారని కూడా మనకు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన పెళ్లి సమయంలో నిహారిక ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఉండాలి అంటూ తనకు వివరించినట్లు తెలుస్తోంది.







