ఈ రెండు పదార్థాలతో నోటి చుట్టూ నలుపును 10 రోజుల్లో మాయం చేసుకోండి!

సాధారణంగా కొందరికి నోటి చుట్టూ ఉండే చర్మం నల్లగా ఉంటుంది.ఎండల ప్రభావం, డిహైడ్రేషన్, స్కిన్ పిగ్మెంటేషన్, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర కారణాల వల్ల నోటి చుట్టూ ఉండే చర్మం నల్లగా మారుతుంటుంది.

 Get Rid Of Dark Skin Around The Mouth In 10 Days With These Two Ingredients Deta-TeluguStop.com

దాంతో ముఖం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా సరే అందవిహీనంగా కనిపిస్తారు.ముఖంలో కళ తప్పుతుంది.

ఈ క్రమంలోనే నోటి చుట్టూ ఉండే చర్మాన్ని మళ్లీ తెల్లగా మార్చుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు.తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.

కొందరైతే ఏవేవో ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ ఇంట్లోనే చాలా సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.అది కూడా కేవలం రెండు పదార్థాలతోనే.ఇంతకీ ఆ రెండు పదార్థాలు మరేంటో కాదు కాఫీ పౌడర్, కొబ్బరి నూనె.

ఇవి రెండు ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ చాలా కామన్ గా ఉంటాయి.అయితే నోటి చుట్టూ ఏర్పడిన నలుపును ఈ రెండిటితో సమర్థవంతంగా వదిలించుకోవచ్చు.

అందుకోసం ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఇన్స్టంట్ కాఫీ పౌడర్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నోటి చుట్టూ ఉన్న చర్మానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత తడి వేళ్ళతో స్మూత్ గా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే ప‌ది రోజుల్లోనే నోటి చుట్టూ నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.పైగా ఏమైనా మడతలు ఉన్నా సరే క్రమంగా దూరం అవుతాయి.అక్కడి చర్మం టైట్ గా బ్రైట్ గా మారుతుంది.

కాబట్టి నోటి చుట్టూ చర్మం నల్లగా మారిందని బాధపడుతున్న వారు తప్పకుండా కొబ్బరి నూనె, కాఫీ పౌడర్ తో పైన చెప్పిన విధంగా చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube