ముడతలు..( wrinkles ) వృద్ధాప్యానికి సంకేతం.వయసు పైబడే కొద్ది కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి.
దాంతో ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు తలెత్తుతాయి.కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది పాతిక, ముప్పై ఏళ్లకే ముడతలను ఫేస్ చేస్తున్నారు.
ఆహారపు అలవాట్లు, జీవనశైలి లో చోటు చేసుకున్న మార్పులు, చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల తక్కువ వయసులోనే ముడతలు ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడతాయి.దాంతో ఈ ముడతలను ఎలా కవర్ చేసుకోవాలో తెలియక మదన పడుతూ ఉంటారు.
వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే ముడతలు పరార్ అవ్వడమే కాదు మళ్ళీ మీ వంక కూడా చూడవు.మరి ఇంకెందుకు ఆలస్యం.ఆ సింపుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి బాగా మరిగించాలి.
వాటర్ సగం అయిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, ( Multani Mitti )మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కాఫీ డికాక్షన్, నాలుగు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్( Vitamin E Oil ) వేసి స్పూన్ సహాయంతో అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పూతలా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే కాఫీ, ముల్తానీ మట్టి మరియు గుడ్డులో ఉండే పలు పోషకాలు సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.ముడతలను మాయం చేస్తాయి.యవ్వనాన్ని రెట్టింపు చేస్తాయి.
వయసు పైబడిన సరే చాలా యంగ్ గా కనిపిస్తారు.కాబట్టి ముడతలకు దూరంగా ఉండాలని కోరుకునే వారు, యవ్వనంగా కనిపించాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.