ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో సానుకూల శక్తి( Positive Energy ) ఉంటే ఆ ఇంటి సభ్యులను చెడు శక్తి ప్రభావాల నుంచి రక్షించడం సులువు అవుతుంది.అందుకే ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు( Vastu ) తప్పనిసరిగా పాటించాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులను ఏ వైపు ఉంచాలో ఇంట్లో నుంచి ఎలాంటి వస్తువులను తీసివేయాలో చెబుతూ ఉంటుంది.ఈ వాస్తు నియమాలన్నీ పాటిస్తే ఇంట్లో ఎప్పుడు సుఖసంతోషాలు ఉంటాయి.
ఈ విగ్రహాలను తెచ్చుకుంటే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఈ రోజు మీరు ఈ విగ్రహాలను ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాం.ఇంట్లో ఏనుగు విగ్రహం( Elephant Idol ) ఉండడం ఎంతో మంచిది.వాస్తు ప్రకారం ఏనుగు శాంతికి చిహ్నం.
అందుకే ఇంట్లో ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది.ఏనుగు విగ్రహం ఉన్న ఇంట్లో తల్లి లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది.
మీ ఇల్లు గందరగోళం, కలహాలు సమస్యలతో బాధపడుతుంటే ఈరోజే మీ ఇంటికీ వెండి లేదా కంచుతో చేసిన ఏనుగు విగ్రహాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచాలి.ఫలితంగా మీ కుటుంబం నుంచి అన్ని వాస్తు దోషాలు దూరం అయిపోతాయి.
ఇంకా చెప్పాలంటే విష్ణు కూడా మత్స్యావతారంలో ఉంటారు.ఈ కారణంగా వెండి లేదా కంచుతో చేసిన చేపను ఇంట్లో ఉంచడం ఎంతో మంచిది.చేప విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఈశాన్యం వైపు ఉంచాలి.దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కొరతా అసలు ఉండదు.కుటుంబ సభ్యుల మనసులో సంతృప్తి ఉంటుంది.ఎలాంటి సమస్యలైనా దూరమైపోతాయి.
ముఖ్యంగా చెప్పాలంటే తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి మీ ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి.ఈ రెండు కూడా నారాయణుని అంశలుగా పరిగణిస్తారు.