రక్తహీనత.ఇటీవల రోజుల్లో కోట్లాది మందికి ఇది పెద్ద శత్రువుగా మారింది.రక్తహీనతను చిన్న సమస్యగా భావిస్తే పొరపాటే.రక్తహీనత వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తారు.నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవడం, తరచూ కళ్లు తిరగడం, ఆకలి లేకపోవడం, పాదాల వాపు వంటివి రక్తహీనత లక్షణాలు.ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేసి రక్తహీనత సమస్యను పట్టించుకోకుంటే ప్రాణాలకే ముప్పుగా మారుతుంది.
అందుకే చాలా మంది రక్తహీనతను నివారించుకోవడం కోసం ఐరన్ క్యాప్సిల్స్ ను వాడుతుంటారు.
అయితే మందులు అక్కర్లేదు.
సహజంగా కూడా ఆ రక్తహీనతను వదిలించుకోవచ్చు.అందుకు కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయ పడతాయి.
అటువంటి వాటిలో తాటి బెల్లం ఒకటి.తాటి బెల్లం లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
రోజుకు రెండు టేబుల్ స్పూన్ల తాటి బెల్లం పొడిని తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ సంపూర్ణంగా అందుతుంది.శరీరానికి సరిపడా ఐరన్ అందితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
దీంతో రక్తహీనత సమస్య పరార్ అవుతుంది.

తాటి బెల్లం ను నేరుగా తీసుకోవచ్చు.లేదా ఒక గ్లాసు పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు.రక్తహీనతతో సతమతం అవుతున్నవారు తాటి బెల్లం ను ప్రతిరోజు తీసుకుంటే కనుక ఎలాంటి మందులు వాడకుండానే ఆ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు.
అలాగే తాటి బెల్లం ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులో ఉండే విషపదార్థాలను బయటకు పంపించి, ప్రేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

అంతేకాదు.దగ్గు ఆస్తమ, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తాటి బెల్లంను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి వేగంగా రికవరీ అవుతారు.తాటి బెల్లం తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
లివర్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
మరియు సంతాన సమస్యలు ఏమైనా ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.కాబట్టి రక్తహీనత ఉన్నవారు మాత్రమే కాదు ఎవరైనా తాటి బెల్లం ను డైట్ లో చేర్చుకోవచ్చు.