బిహార్( Bihar ) ముఖ్యమంత్రి నితీష్ కుమార్( Nitish Kumar ) విపక్షాల ఐక్యత కోసం గత కొన్ని రోజులుగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.గత ఏడాదీ ఎన్డీయే నుంచి అనూహ్యంగా బయటకు వచ్చి ప్రత్యర్థి పార్టీ అయిన ఆర్జేడి తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్.
అప్పటి నుంచి బీజేపీ విముక్త భారత్ నినాదాన్ని అందుకున్నారు.వచ్చే ఏన్నికల్లో ఎలాగైనా మోడిని గద్దె దించాలని పట్టుదలగా ఉన్న నేతల్లో నితీష్ కుమార్ కూడా ఒకరు.
రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న నితీశ్ తనదైన వ్యూహరచనతో అనూహ్య పరిణామాలకు తెరతీస్తుంటారు.కాగా విపక్షాల ఐక్యత విషయంలో మొదట్లో సైలెంట్ ఉన్న నితీష్ ఈ మద్య తెగ హడావిడి చేస్తున్నారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు.ప్రధాని పదవి చేపట్టాలనే కోరిక నితీష్ కు మొదటి నుంచి ఉంది.ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమౌతున్న నేపథ్యంలో ఏ మాత్రం సైలెంట్ గా వ్యవహరించిన విపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థిగా నితీష్ తెరమరుగు అయ్యే అవకాశం ఉంది.అందుకే తాను కూడా రేస్ లో ఉన్నానని చెప్పేందుకే ఈ మద్య నితీష్ కుమార్ తెగ దూకుడు ప్రదర్శిస్తున్నారనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
ఈప్పటికే కేసిఆర్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్( KCR, Mamata Banerjee, Akhilesh Yadav ) వంటి వారితో సమావేశం అయిన నితీష్ ఐక్యతకు పిలుపునిచ్చారు.కాగా ఈ నెల పాట్నాలో దేశ వ్యాప్తంగా విపక్షా పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్దమయ్యారు.

ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజృవాల్, పినరాయి.వంటి ఎందరో ప్రముఖులు హాజరవుతారనే వార్తలు కూడా వినిపించాయి.కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సంవేశం వాయిదా పడిందట.అయితే రాహుల్ గాంధీ, కేజృవాల్ వంటి వారు కూడా ప్రధాని రేస్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకమైనప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనే చర్చ రావడం సర్వసాధారణం.ఈ నేపథ్యం రాహుల్ గాంధీ, కేజృవాల్, మమతా బెనర్జీ వంటి వారిని కాదని ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ను విపక్ష పార్టీలు ఒప్పుకుంటాయా అనేది కూడా డౌటే.
మొత్తానికి ప్రధాని పదవి టార్గెట్ గా విపక్షాల ఐక్యతను కోరుకుంటున్న నితిశ్ కుమార్ వ్యూహం ఫలిస్తుందో.బెడిసి కొడుతుందో చూడాలి.







