ఒంట్లో కొవ్వు పెరిగే కొద్ది శరీర బరువు పెరిగిపోతుంది.అలాగే గుండె పోటు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వివిధ రకాల జబ్బులు తలెత్తే అవకాశాలు సైతం రెట్టింపు అవుతాయి.
అందుకే ఒంట్లో పెరిగిన కొవ్వును కరిగించుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ ఫ్యాట్ బర్నర్ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.
ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక పైనాపిల్ ను తీసుకుని తొక్కను చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అలాగే చెక్కేసిన పైనాపిల్ తొక్కలను వాటర్‌తో ఒకసారి కడిగి గిన్నెలో వేసుకోవాలి.అలాగే అందులో రెండు గ్లాసుల వాటర్ పోసి.స్టవ్ పై పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు హీట్ చేయాలి.ఆ తర్వాత స్టైనర్ సాయంతో పైనాపిల్ పీల్ వాటర్‌ను సపరేట్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
ఈ వాటర్ కూల్ అయ్యే లోపు ఒక కీరదోసను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి స్లైసెస్‌గా కట్ చేయాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కీరదోస ముక్కలు, అల్లం ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ పీల్ వాటర్, రెండు టేబుల్ స్సూన్ల నిమ్మ రసం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఫ్యాట్ బర్నర్ జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ జ్యూస్‌ను వారంలో మూడు సార్లు గనుక తాగితే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వంతా క్రమంగా కరిగిపోతుంది.వెయిట్ లాస్ అవుతారు.గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుముఖం పడుతుంది.
మరియు చర్మం కూడా ఆరోగ్యవంతంగా, యవ్వనంగా మెరుస్తుంది.కాబట్టి, తప్పకుండా ఈ ఫ్యాట్ బర్నర్ జ్యూస్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి.