జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగాలని ఆరాటపడిన అమ్మాయిలు ఉండరు.జుట్టు పొడవుగా ఉంటే అందం మరింత రెట్టింపు అవుతుంది.
అందుకే కేశాలకు కాస్ట్లీ ఆయిల్స్, షాంపూస్ వాడుతుంటారు.కానీ, నేటి కాలంలో ఎంత కాస్ట్లీ ప్రోడెక్ట్స్ ఉపయోగించినప్పటికీ.
చాలా మంది హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్ ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.
అయితే కెమికల్స్‌తో నిండి ఉండే ఆయిల్స్, షాంపూలు కాకుండా న్యాచురల్ పద్ధతిలో కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా పొడవైన జట్టును పొందొచ్చు.
ముఖ్యంగా జుట్టు నల్లగా, పొడవుగా పెరిగేలా చేయడంలో తోటకూర అద్భుతంగా సహాయపడుతుంది.
తోటకూరలో కేవలం ఆరోగ్యానికే కాదు కేశాలకు ఉపయోగపడే పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.మరి తోటకూరను కేశాలకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా తోటకూరను ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దుగా పెరుగు కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, కుదుళ్లకు మరియు కేశాలకు బాగా అప్లై చేసి ఒక గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే నల్లగా, పొడవుగా పెరుగుతుంది.మరియు ఈ ప్యాక్ వల్ల జుట్టు రాలడం కూడా తగ్గు ముఖం పడుతుంది.
![Telugu Amaranth, Care, Latest, Long Black, Thotakura, Tips-Telugu Health - త Telugu Amaranth, Care, Latest, Long Black, Thotakura, Tips-Telugu Health - త]( https://telugustop.com/wp-content/uploads/2021/04/hair-care-latest-news-tips-for-hair-benefits-of-thotakura-Amaranth-hair-long-and-black-hair.jpg)
అలాగే కొన్ని తోటకూర ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఆ రసంలో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి అర గంట లేదా గంట పాటు వదిలేయాలి.
ఆ తర్వాత మామూలు షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తూ ఉంటే.
జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.మరియు మెయిర్ డ్యామేజ్ సమస్య కూడా దూరం అవుతుంది.