ఊపిరితిత్తులను సహజంగా శుభ్రం చేసుకొనే పద్ధతులు ఉన్నాయని మీకు తెలుసా?

Tips For Keeping Yourlungs Clean

మారిన పరిస్థితుల కారణంగా వాతావరణంలో విపరీతమైన కాలుష్యం పెరిగిపోయింది.వాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

 Tips For Keeping Yourlungs Clean-TeluguStop.com

ఒక్క కాలుష్యం వల్లనే కాకుండా పొగ త్రాగటం,కొన్ని దీర్ఘ కాలిక వ్యాధుల కారణముగా ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి.ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలి.

ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం పరగడుపున 5 తాజా పుదీనా ఆకులను నమిలితే ఊపిరితిత్తులుశుభ్రం అవుతాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం త్రాగితే ఊపిరితిత్తులలో ఉండే విష పదార్ధాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ఆరెంజ్, అరటిపండు, కంద‌గ‌డ్డ‌లు, క్యారెట్లు,కొబ్బరి నీళ్లు వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రంఅవుతాయి.

క్యారెట్ జ్యుస్ ని ఫ్రెష్ గా తీసుకోని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు త్రాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం పిండుకొని త్రాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ప్రతి రోజు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ త్రాగితే ఊపిరితిత్తులలో ఉండే వ్యర్ధాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube