ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొచ్చేవారు.కానీ ఇప్పుడు మాత్రం స్టార్ డైరెక్టర్లు సైతం గుర్తుకు వస్తున్నారు.
మంచి సినిమాలతో మ్యాజిక్ ను చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్ ( Star director )లందరు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషలైజేషన్ ను కోరుకుంటున్న నటులు సైతం చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ‘ బాహుబలి ‘, ‘ట్రిబుల్ ఆర్ ‘ సినిమాలతో రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు పెను ప్రభంజనాలు సృష్టిస్తుంటే చిన్న సినిమాలతో కూడా మంచి కంటెంట్ ను చెప్పాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ సినిమా దర్శకులు అందరూ వాళ్లకంటూ ఒక సపరేటు గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకోవడం విశేషం… ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న సందర్భంగా మన తెలుగు నుంచి కూడా చాలామంది స్టార్ డైరెక్టర్లుగా మరే అవకాశాలైతే ఉన్నాయి.

ముఖ్యంగా ప్రశాంత్ వర్మ( Prashant Verma ) ఇప్పటికే స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నప్పటికి రాబోయే సినిమాలతో మరింత ముందడుగు వేసే అవకాశాలైతే ఉన్నాయి.ముఖ్యంగా హనుమాన్ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు.ఇక ఇప్పుడు జై హనుమాన్( Jai Hanuman ) అనే సినిమాతో కూడా మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తనకున్న స్టార్ డమ్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తోంది…
.