ఒకప్పుడు తెలుగు సినిమా పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరు మనవాళ్లకు సినిమాలు తీయరాదు అని హేళన చేసేవారు.కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా అనేది కొనసాగుతుందనే చెప్పాలి.
చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సందర్భంలో తమను తాము ఎలాగైనా సరే సిల్వర్ స్క్రీన్ మీద స్టార్లుగా నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో కూడా విపరీతమైన కష్టాన్ని పడుతూ ముందుకు సాగుతున్న వాళ్ళు ఉండడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఉన్న చాలా మంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం…అయితే తెలుగులో రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ( Sankrantiki vastunnam )భారీ విజయాన్ని సాధించింది.దాదాపు ఈ సినిమా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక ఇప్పుడు సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ మాత్రమే టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాదిరిగానే చిరంజీవితో ,అనిల్ రావిపూడి( Anil Ravipudi , Chiranjeevi ) చేస్తున్న సినిమా కూడా ఇలాగే ఉండబోతుందా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి అనిల్ రావిపూడి యాక్షన్ ఎపిసోడ్ ని భారీగా చూపిస్తూ కామెడీ ని కూడా పండించగలిగే దర్శకుడు అయినప్పటికి ఆయన ఈ సినిమా కోసం స్వతహాగా కామెడీ ఎపిసోడ్ ని కీలకంగా తీసుకుని ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ ని క్లైమాక్స్ లో మాత్రమే చూపించి ప్రేక్షకులను రక్తి కట్టించారు.మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఇక చిరంజీవి సినిమాలో కూడా ఫ్యామిలీ కి నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటుండటం విశేషం…చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.