గోవాలో(Goa) ఐరిష్ యువతి డేనియల్ మెక్‌లాఫ్లిన్‌పై జరిగిన అత్యాచారం, హత్య(Rape, murder) కేసు ఎట్టకేలకు వీడింది.వికాట్ భగత్ అనే స్థానిక కామాంధుడు దోషిగా తేలాడు.
దక్షిణ గోవాలోని జిల్లా, సెషన్స్ కోర్టు శుక్రవారం ఈ తీర్పును వెలువరించింది.ఈ దారుణ ఘటనతో ఇండియా టూరిజం ఒక్కసారిగా డేంజర్ జోన్‌లో పడిందా? ఇండియా పర్యాటక రంగానికి ఇది నిజంగా మాయని మచ్చలాంటిదేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఐర్లాండ్‌లోని కౌంటీ డోనెగల్‌కు (County Donegal, Ireland)చెందిన 28 ఏళ్ల డేనియల్ మెక్‌లాఫ్లిన్ బ్యాక్‌ప్యాకర్‌గా(Daniel McLaughlin, backpacker) ఇండియాకు వచ్చింది.గోవాలో తన స్నేహితురాలితో కలిసి బీచ్ హట్‌లో ఉంటోంది.2017, మార్చిలో హోలీ పండుగ(Holi festival) చేసుకున్న తర్వాత, ఆమె కెనకోనా, గోవాలోని పొలాల్లో దారుణ హత్యకు గురై కనిపించింది.
ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న డేనియల్ కుటుంబానికి ఈ తీర్పు కాస్త ఊరటనిచ్చింది.
దోషిగా తేలిన వికాట్ భగత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.డేనియల్ తల్లి ఆండ్రియా బ్రాన్నిగన్, సోదరి జోలీన్ మెక్‌లాఫ్లిన్(Daniel’s mother is Andrea Brannigan, sister is Jolene McLaughlin) బ్రాన్నిగన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ “చివరికి న్యాయం జరిగింది” అని సంతోషం వ్యక్తం చేశారు.
డేనియల్ హత్యకు వికాట్ భగత్ ఒక్కడే కారణమని, ఇందులో ఇతర నిందితులు ఎవరూ లేరని వారు స్పష్టం చేశారు.

సుదీర్ఘ విచారణ, అనేక ఇబ్బందులు, జాప్యాల మధ్య ఈ కేసు నడిచిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.తమ స్వస్థలం బన్‌క్రానా, కౌంటీ డోనెగల్‌కు చాలా దూరంలో విచారణ జరగడంతో మరింత కష్టంగా మారిందని వాపోయారు.సంక్లిష్టమైన న్యాయ ప్రక్రియలో తమకు సహాయం చేసిన భారత, ఐరిష్ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
బ్రిటిష్, ఐరిష్ కాన్సులేట్ సిబ్బంది అందించిన మద్దతును వారు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.గుండెను పిండేసే దుఃఖంలో ఉన్నా, డేనియల్ చివరి రోజులు గడిపిన ప్రదేశాన్ని సందర్శించారు.
ఈ తీర్పుతో డేనియల్‌తో పాటు తమ కుటుంబానికి కొంత శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఐరిష్ డిప్యూటీ ప్రీమియర్ సైమన్ హారిస్ డేనియల్ తల్లి ధైర్యసాహసాలను కొనియాడారు.ఈ తీర్పు బాధిత కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.“వారి బాధను ఏదీ తగ్గించలేకపోయినా, ఈ తీర్పు వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా,” అని హారిస్ అన్నారు.డేనియల్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ ముందుకు సాగాలని ఆమె కుటుంబం భావిస్తోంది.అయితే ఈ దారుణ ఘటన మాత్రం ఇండియా పర్యాటక ముఖానికి ఒక మాయని మచ్చగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.