మెగా ప్రిన్సెస్ క్లింకార( Klin Kaara ) కొణిదెల ముఖాన్ని చూడడానికి మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన( Upasana ) దంపతులు మాత్రం ఇప్పటివరకు తన కూతురు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు తమ కుటుంబ సభ్యులకు తప్ప అభిమానులకు మాత్రం ఎక్కడా చూపించలేదు.
ఇలా మెగా వారసురాలిని చూడడం కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు అయితే ఇదే విషయం గురించి బాలకృష్ణ ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ ని ప్రశ్నించారు.
ప్రస్తుతం తన కూతురు అమ్మ అని పిలుస్తుందని ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో ఆ క్షణం తన కూతురిని అందరికీ పరిచయం చేస్తాను అంటూ రాంచరణ్ తెలిపారు .అయితే తాజాగా రాంచరణ్ కూతురికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోలో భాగంగా చిన్నారి ఫేస్ క్లియర్గా కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.అవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలలో క్లీన్ కారాను చూసిన మెగా అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తూ చిన్నారి క్లిన్ కారా చూడముచ్చటగా చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లో చేస్తున్నారు.ఇక వీరిద్దరూ తమ కూతురును అందరికీ ఎప్పుడు అధికారకంగా చూపిస్తారు అనేది తెలియాల్సి ఉంది.ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.ఇటీవల గేమ్ ఛెంజర్ సినిమా ద్వారా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది.ఇక ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.