ఇఫ్తార్ విందులో చక్కెర వ్యాధి ఉన్నవారు.. ఈ ఆహారాలు మాత్రమే తీసుకోవాలి..

రంజాన్ ( Ramadan )మాసంలో ఇఫ్తార్ విందుకు( Iftar feast ) చాలా ప్రాముఖ్యత ఉంది.ముస్లిం సోదరులంతా ఒకే చోట కూర్చుని భోజనాలు చేస్తారు.

 People With Diabetes Should Eat Only These Foods In Iftar ,diabetes, Foods In If-TeluguStop.com

ఇలా చేయడాన్ని ఇఫ్తార్ విందుగా భావిస్తారు.అయితే ఈ సంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది.

రంజాన్ ఫాస్టింగ్( Ramadan Fasting ) లో భాగంగా ప్రార్థనాలను నిర్వహించి సూర్యోదయానికి ముందు ఆహారాలు తీసుకోవడం జరుగుతుంది.అయితే ఈ క్రమంలో మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

అంతేకాకుండా సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారంలో తప్పకుండా నిపుణులు సూచించినవే తీసుకోవాలని చెబుతున్నారు.మధుమోహంతో బాధపడుతున్న వారు రంజాన్ ఉపవాసంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.మధుమేహంతో బాధపడుతున్న వారు రంజాన్ ఉపవాసాలలో తప్పకుండా నిపుణులు సూచించిన చిట్కాలను కచ్చితంగా పాటించాలి.రోజంతా శరీరం శక్తివంతంగా ఉండేందుకు ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాలి.

ముఖ్యంగా ఓట్స్, బ్రెడ్, బననా, స్మూతీ వంటివి తీసుకోవడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది.అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు బారిని పడకుండా శరీరం దృఢంగా ఉంటుంది.

మధుమేహంతో బాధపడుతున్న వారు ఇస్తార్ విందులో భాగంగా ఖర్జురా, స్వీట్స్ ఇతర వేయించిన ఆహారాలను తినకూడదు.ఎందుకంటే ఇవన్నీ అనారోగ్య ఆహారాల క్రిందకి వస్తాయి.కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.అయితే వీటికి బదులుగా ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాల ను తినవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యమైన ఆహారాలు తీసుకున్న తర్వాత తగిన మోతాదులో నిద్రపోవడం కూడా ఎంతో మంచిది.ముఖ్యంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు కనీసం ఏడు గంటలు తప్పకుండా నిద్రపోవాలి.

కాబట్టి మంచి ఆహారాలు తీసుకున్న తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube