డర్టీ పిక్చర్, మిషన్ మంగల్, శకుంతలా దేవి, షేర్ని, ఎన్టీఆర్:కథానాయకుడు, ఎన్టీఆర్:మహానాయకుడు వంటి సినిమాలతో భారతదేశ వ్యాప్తంగా ప్రజలను అలరించింది విద్యాబాలన్( Vidya Balan ).ఇంకా ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ ( Web series )ల లోకి అడుగుపెట్టలేదు.
చాలా టాలెంట్ ఉన్నా ఈ తారకు సినిమా అవకాశాలు భారీ స్థాయిలో రాకపోవడం గమనార్హం.విద్యాబాలన్ చాలా బోల్డ్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది.
ఆమె తన వంపులను, సహజమైన అందాలను చాలా ఇష్టపడుతుంది.ఇతర హీరోయిన్ల లాగా ఆమె తన బాడీ గురించి ఎప్పుడూ కూడా నెగిటివ్ గా ఆలోచించదు.
తనకు ఉన్న ఫిజికల్ ఫీచర్లను ధైర్యంగా చూపిస్తుంది.కెరీర్ ప్రారంభించినప్పుడు బరువు తగ్గాలని, ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని తనను ఒత్తిడి చేశారని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు, అయితే అందుకు తాను నిరాకరించానని వెల్లడించింది.
ఆమె ఇలా చెప్పింది, “నేను సన్నగా ఉండే అమ్మాయిలలో ఒకడిని కాదు, నేను మంచి సౌత్-ఇండియన్ అమ్మాయిని, నా కర్వ్స్ పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉన్నాయి.కెరీర్ తొలినాళ్లలో సినిమా వాళ్లు నన్ను కొంచెం బరువు తగ్గించుకోమని చెప్పారు, వారు చెప్పినట్లే నేను చేశాను.అయితే నేను ఫేస్ లో కూడా చబ్బినెస్ కోల్పోయాను, దాని వల్ల ముక్కు పొడవుగా ఉందని వారు చెప్పారు. ముక్కుకు సర్జరీ( Nose surgery ) చేయించుకోవాలని వారు కోరుకున్నారు, కానీ నేను నో అన్నాను.దేవుడు నన్ను ఇలానే పుట్టించాడు, నేను ఇలాగే ఉంటాను అని స్పష్టం చేశాను.” అని చెప్పుకొచ్చింది.
విద్యాబాలన్ అసాధారణమైన పాత్రలు, బలమైన స్క్రీన్ ప్రెసెన్స్ కు ప్రసిద్ధి చెందింది.ఆమె పరిణితి చోప్రాతో( Parineeti Chopra ) కలిసి సినిమాల్లో అరంగేట్రం చేసింది.ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శరీర భాగాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె నిరూపించింది.గ్లామర్ తో ఆధిపత్యం చెలాయించే సినిమా ప్రపంచంలో ఆమె తనదైన గుర్తింపును ఏర్పరుచుకుంది.ఈ తార నేషనల్ ఫిలిం అవార్డు ( National Film Award )కూడా గెలుచుకుంది.ఆమెకు 2014లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందించింది.
ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ “లవర్స్” అనే సినిమాలో నటిస్తోంది.ఇది స్మాల్ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది.
దీని రిలీజ్ డేట్ గురించిన వివరాలు తెలియ రాలేదు.ఇది తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడం గమనార్హం.