అవిసె గింజలు( Flax seeds ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.పోషకాల నిలయమైన అవిసె గింజలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయి.
వయసు పెరుగుతున్న ఎటువంటి ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.అయితే అటువంటి చర్మాన్ని అందించడానికి ఇప్పుడు చెప్పబోయే అవిసె గింజల ఫేస్ ప్యాక్ అద్భుతంగా తోడ్పడుతుంది.
మరి ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్( cup of water ) వేసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు మరియు వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి ( rice flour )వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో అవిసె గింజలు బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు( Papaya slices ), రెండు టేబుల్ స్పూన్లు రోజు వాటర్, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.ఆల్రెడీ ముడతలు, సన్నని గీతలు ఉంటే వాటిని క్రమంగా మాయం చేస్తుంది.చర్మం యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.

అలాగే ఈ హోమ్ రెమెడీ దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేయడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.చర్మ ఆకృతిని, మృదుత్వాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.అంతేకాకుండా ఈ రెమెడీ తేమను లాక్ చేసి చర్మం డ్రై అవ్వకుండా కాపాడుతుంది.