సంక్రాంతి పండుగ (Sankranti festival)కానుకగా విడుదలైన అన్ని సినిమాలు దాదాపుగా 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.సంక్రాంతి సినిమాలను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలపై మాత్రం పెద్దగా ఆసక్తిగా చూపడం లేదు.
తండేల్ (Tandel)సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అందుకుంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఫిబ్రవరి 14వ తేదీన లైలా, బ్రహ్మా ఆనందం(Laila ,Brahma Anandya) సినిమాలు విడుదల కాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.లైలా (సినిమాకు ఏడున్నర కోట్ల రూపాయల రేంజ్ లో బ్రహ్మా ఆనందం(Brahma Anandam ) సినిమాకు 6.50 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఈ సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

తండేల్ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోగా చైతన్య కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను మాత్రం ఈ సినిమా అందించలేకపోయింది.ఒక సినిమా హిట్టైన తర్వాత మరో సినిమాకు జనాలు భారీగా ఖర్చు చేయాలంటే సులువు కాదు.ఫిబ్రవరి నెలలో రిలీజవుతున్న ఇతర సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

ఫిబ్రవరి నెల సాధారణంగా సినిమాలకు అన్ సీజన్ అని అందరూ భావిస్తారు.అయితే ఫిబ్రవరి నెలలో విడుదలై హిట్ సాధించిన సినిమాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.లైలా, బ్రహ్మా ఆనందం సినిమాలకు భారీగా నష్టాలు మిగిలే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సంక్రాంతి సినిమాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితం అవుతున్నాయి.
దర్శకనిర్మాతలు కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.