కొంతమందికి కార్లు అంటే మామూలుగా ఇష్టం కాదు.అది ఎంతలా అంటే కొన్ని మాటల్లో చెప్పలేనివి, మరికొందరు ఇంట్లో వ్యకిలా చేసుకుంటుంటారు.
కొందరు తమ కారు (Car)లుక్‌ను ప్రత్యేకంగా మార్చేందుకు విభిన్నమైన మార్పులు చేస్తారు.ఇందుకు తాజాగా ఉదాహరణగా రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కారును పూర్తిగా రూపాయి నాణేలతో(Rupees Coins) కవర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న కారును చూస్తే, ఇది మారుతి సుజుకి (Maruti Suzuki)కంపెనీకి చెందినదని లోగో ద్వారా అర్థమవుతోంది.అయితే కారు మోడల్ మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు.దీనికి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు, విండోస్ నుంచి సైడ్ మిర్రర్స్(Side mirrors ,windows) వరకు – అన్నీ రూపాయి నాణేలతో కప్పేశారు.
సన్‌లైట్‌లో ఇది మెరుస్తూ ఒక అద్భుతమైన లుక్‌ను అందిస్తోంది.ఈ కారును చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు అతని క్రియేటివిటీ విపరీతంగా ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం కాస్త ఫన్నీగా.అసలైన చిల్లర కారు! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ప్రత్యేకమైన డిజైన్ వెనుకున్న వ్యక్తి గురించి ఇంకా పూర్తి సమాచారం బయటకు రాలేదు.అలాగే ఈ వీడియోను షేర్ చేసిన వారు కూడా కారు యజమాని కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.అయితే, ఇది చూసిన తర్వాత కేవలం మోడిఫికేషన్ మాత్రమే కాదు.మన ఆలోచనల్లో కొత్తదనం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను చూసారా? ఈ కారుపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి!
.