ముస్లిం ప్రజలకు రంజాన్( Ramadan ) పండుగ అతిపెద్ద పండుగగా పేర్కొనబడింది.సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగ ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉండి అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.
అయితే ఈ సమయంలో ముస్లిమ్స్ ఆధ్యాత్మిక శాంతిని కాఠిన్యాన్ని కోరుకుంటారు.అలాగే అల్లా పట్ల తమకున్న ప్రేమ అలాగే భక్తిని ప్రదర్శిస్తారు.
రంజాన్ అని పిలవబడే రంజాన్ ఇస్లామిక్ లూనార్ క్యాలెండర్ లో( Islamic Lunar Calendar ) 9వ నెల అలాగే సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన సమయాలలో ఇది ఒకటి.
ఈ రంజాన్ సందర్భంగా ప్రజలు 30 రోజుల పాటు కనీసం నీరు కూడా తాగకుండా తెల్లవారుజామున నుండి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు.ఇక ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు.అలాగే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ అయినందువలన తమ కుటుంబం, స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.
చెప్పాలంటే రంజాన్ మాసం మొత్తం ముస్లిం సమాజానికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.అయితే రంజాన్ చివరి పది రోజుల రాత్రులకు మాత్రం మరింత ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఈరోజుల్లో అల్లా మరింత దయగలవాడని అలాగే ప్రతిఫలం ఇస్తాడని అందరూ నమ్ముతారు.ఈ రాత్రులలో ప్రవక్త మహమ్మద్ ( Prophet Muhammad )(సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర ఖురాన్ ను అవతరించినప్పటి నుండి లైల తుల్ ఖదర్ రంజాన్ యొక్క అత్యంత పవిత్రమైన రాత్రులలో ఒకటి.
అయితే ప్రపంచంపై అల్లా తన దయను కురిపించే సందర్భం ఈ రాత్రులు.అలాగే ప్రతి ఒక్క మనిషి యొక్క విధిని అల్లా నిర్ణయించే సమయమని కూడా ముస్లింలు నమ్ముతారు.
ఇక రంజాన్ చివరి 10 రోజులను ఏకాంతంలో (ఇతికాఫ్) గడపాలని సూచించడం జరిగింది.దీంతో ప్రజలందరూ కేవలం అల్లాను ఆధారించడం పై మాత్రమే దృష్టి పెట్టగలరు.ఈ రాత్రులలో అల్లాపై ముస్లిం ప్రజలు దైవభక్తిని మరింత పెంచుతారు.అలాగే అల్లా యొక్క దయను పొందేందుకు అవసరమైన వారికి దానం చేయడం లాంటివి చేస్తారు.ఇలా చేస్తే ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు అని వారు నమ్ముతారు.