కామధేను విగ్రహాన్ని ఇంట్లో ఆ ప్రదేశంలో పెడితే మంచిదా..

మన భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే వారి ఇంటి నిర్మాణాలు కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

 Is It Better To Keep Kamadhenu Idol In That Place In The House Details, Kamadhen-TeluguStop.com

వారి ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని వారు బలంగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మన దేశంలో చాలామంది ప్రజలు ఆవును గోమాతగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు.

గోమాతకు పూజలు చేస్తే వారి ఇంటిలోకి సిరిసంపదలు వస్తాయని చాలామంది ప్రజల నమ్మకం.

పురాతన కాలం నుండే అవును మన ఇంటి లక్ష్మిగా భావించేవారు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు.

కామదేను విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదే కానీ వాటిని శాస్త్ర ప్రకారంగా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది.ఇంట్లో లేదంటే ఆఫీసులలో, వ్యాపార ప్రదేశాలలో ఈ కామదేను విగ్రహాన్ని ఉంచడం వల్ల అదృష్టంతో పాటు మనం అనుకునే కోరికలు కూడా తీరుతాయని చాలామంది నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాన్ని ఈశాన్యం దిక్కున ఉంచడం మంచిది.

ఈ విధంగానే ఈ ఈశాన్యం దిశలో ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇంటికి శుభప్రదంగా భావిస్తారు.

Telugu Calf, Vasthu Tips, Kamadhenu, Kamadhenu Idol, Kamadhenu Pooja, Lakshmi De

ఎందుకంటే విగ్రహాలను పెట్టడానికి చాలా పవిత్రమైనది.ఇంటి ముఖద్వారం దగ్గర ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆనందంతో, సుఖసంతోషాలతో ఉంటారు.ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం వెండి ఆవు, దూడ విగ్రహాలు చాలా పవిత్రమైనవిగా నమ్ముతారు.ఈ విగ్రహాలను దేవుడి గదిలో పెట్టి పూజ చేయడం కూడా ఎంతో మంచిది.

అలాగే ఇత్తడి తో చేసిన ఆవు, దూడ విగ్రహాలను కూడా ఇంట్లోకి తీసుకురావచ్చు.వీటిని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube