దాదాపు ప్రతి రోజు చాలా మంది ప్రజలు నిద్ర లేవగానే ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గులు ( Rangoli ) పెడుతూ ఉంటారు.ఇక పండగల సమయంలో అయితే పెద్ద పెద్ద రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు.
సంక్రాంతి( Sankranti ) వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే ఇళ్ల ముందు ముగ్గులు వేసి వాటిని పూలతో అందంగా అలంకరిస్తూ ఉంటారు.అలాగే భోగి రోజు భోగి కుండ ముగ్గు, సంక్రాంతి రోజు వేసే రథం ముగ్గు ఎంతో ఫేమస్ అని దాదాపు చాలామందికి తెలుసు.
అందమైన రంగుల ముగ్గులు ఇంటి ముందు వేయడం వల్ల ఇంటికి అదృష్టాన్ని( Luck ) తీసుకొస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా శుక్రవారం ముగ్గు, శనివారం ముగ్గు, చుక్కల ముగ్గు, మెలికల ముగ్గు అంటూ రకరకాల ముగ్గుల డిజైన్లు ఉంటాయి.

ఒక్కొక్క ముగ్గు కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.దేవతలు, దేవుళ్లను ఆహ్వానిస్తూ కూడా ముగ్గు వేస్తారని చెబుతారు.శుక్రవారం పూట ముగ్గు వేస్తే కొంత మంది మహిళలు తప్పకుండా పసుపు, కుంకుమతో అలంకరిస్తారు.ఇంకా చెప్పాలంటే ముగ్గు వేయడం అనేదానీ వెనుక ఒక చిన్న కథ ఉందని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఇతిహాసాల ప్రకారం ఒక రాజు కుమారుడు చనిపోతాడు.దీంతో రాజు తన కుమారుడిని బతికించమని సృష్టికర్త బ్రహ్మ దేవున్నీ( Brahmadeva ) వేడుకుంటాడు.
బ్రహ్మ దేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేస్తాడు.

చివరికి కనికరించి బ్రహ్మ దేవుడు అతడి ముందు ప్రత్యక్షమై రాజు కొడుకుని బతికించడానికి అంగీకరిస్తాడు.అప్పుడు బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో కుమారుడి బొమ్మ గీయమని రాజుకు చెప్తాడు.బ్రహ్మ చెప్పినట్టుగా రాజు బొమ్మను వేస్తాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అతడి కొడుక్కి ప్రాణం పోస్తాడు.అప్పటి నుంచి ఈ ముగ్గు ఆచారం మొదలైంది.
ముగ్గు అదృష్టం, శ్రేయస్సు తీసుకొస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అందుకే ప్రతి ఒక్కరు ఇంటి ముందు చక్కని ముగ్గులు వేయడం ప్రారంభించారు.
ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం అని దాదాపు చాలా మందికి తెలుసు.