మీరు కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయారా? మీ జాబ్‌లో మీకు ఇంకా ఇంక్రిమెంట్ రాలేదా? మీరు కెరీర్‌లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, ఈ వాస్తు టిప్స్ పాటించండి.మనం చేసే చిన్న పొరపాట్లకు కూడా కొన్ని మనకు తెలియకుండానే విరుద్ధంగా మారిపోతాయి.
ప్రతీది వాస్తు ప్రకారం అనుసరించి చేసేవారు ఎక్కువమందే ఉన్నారు.ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం.
గత సంవత్సరం నుంచి లాక్ డౌన్ కారణంగా మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతోంది.స్ట్రెస్‌కు గురైనవారు కూడా ఉన్నారు.
అయితే, కొన్ని వాస్తు నియ మాలను పాటిస్తూ, మళ్లీ కెరీర్‌లో పుంజుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.మీరు వెళ్లే మార్గంలోనే వీటిని పాటిస్తే సరిపోతుంది.
దీనికి ప్రత్యేకంగా డబ్బులు పెట్టి చేయాల్సిన నియమాలు కావు.చాలా సులభం.
పురాతన కాలం నుంచి వాస్తుశాస్త్రాలను అనుసరించి భవనాలను నిర్మిస్తాం.నలుదిక్కులా ఏ లోపాలు లేకుండా… సహజసిద్ధంగా ఉండటం అందరికీ తెలుసు!
– ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించేటపుడు ఏ దిక్కులో కూర్చోవాలో కూడా చాలా ముఖ్యం.
ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రత్యేక దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి.అదే, నైరుతి.
ఈ దిశలోనే ఎలక్ట్రానిక్ వస్తువులు, వైర్లు, కేబుల్స్‌ను అమర్చుకోవాలి.దీంతో మీరు కెరీర్‌లో త్వరగా స్థిరపడటానికి ఇవి ఉపయోగపడతాయి.
కరెంటు వైర్లను వేలాడకుండా ఏర్పాటు చేసుకోవాలి.

– ఈ రోజుల్లో ఎక్కువ శాతం వర్క్ ఫ్రం హోం ఎక్కువగా నిర్వర్తిస్తున్నారు.పని చేసేటపుడు కూర్చునే దిశ కూడా కీలకమైంది.ఈ సమయంలో అడ్డదిడ్డంగా కాళ్లు చాపుకొని కూర్చోకుండా, వెన్నుముఖ కూడా నిటారుగా పెట్టి కూర్చోవాలి.
ఎక్కువ ఎత్తులో ఉండే బ్యాక్ చైర్‌లో కూర్చుంటే… మీ కెరీర్‌లో కూడా ఎదుగుదల ఉంటుందని అర్థం.
– ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసేవారు పని చేసే పరికరాలను బెడ్‌రూం లో ఏర్పాటు చేసుకోకూడదు.
అంతేకాదు, వీటికి ఉపయోగించే చైర్, టేబుల్‌ను చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి.దీనికి గుండ్రంగా ఉండకూడదు.

– మీరు పనిచేస్తున్న టేబుల్‌పై క్రిస్టల్ వస్తువులను పెట్టుకోవడం వల్ల ఎనర్జీ లెవల్ పెరుగుతుందట.వర్క్‌లో కూడా మీకు ఎఫిషియెన్సీ పెరుగుతుంది.క్వార్ట్›్జ క్రిస్టల్స్‌ను ఆఫీసులో పెట్టుకోవడం వల్ల మంచి అవకాశాలను పొందుతారు.అలాగే బాంబో ప్లాంట్‌ను పెట్టుకోవడం వల్ల కూడా లాభదాయకం.
– వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునే సమయంలో తూర్పునకు తల పెట్టి పడుకోవాలి.దీంతో మీ కెరీర్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది.
మీకు ఏకాగ్రత పెరుగుతుంది.అలాగే మానసిక స్థైర్యంతో పుంజుకుంటుంది.
పనిచేసేటపుడు కూడా ఉత్తరం దిÔ¶ గా చేయాలి.అంతేకాదు మనం పనిచేస్తున్న ప్రదేశంలో వెనుకవైపు కిటికీలు లేకుండా చూసుకోవాలి.
వీటితో మీకు డిస్ట్రబెన్స్ ఏర్పడుతుంది.