దేశం ఎంత అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుని పోతున్నాగాని మన సమాజంలో మార్పు అనేది రావడం లేదు.ఎంత అభివృద్ధి చెందుతున్న గాని ఆడవాళ్లకు మాత్రం బాధలు తప్పడం లేదు.
సాధరణ మహిళలకు మాత్రమే కాదు, అన్నీ రంగాల్లో ఉన్న మహిళలకు కూడా వేధింపులు తగ్గడం లేదు.వెండితెర మీద మనం చూసే సినిమాలోని హీరోయిన్లు, నటీమణులు చాలా మందే ఉంటారు.
ఆ సెలెబ్రిటీల మాదిరి మన జీవితం కూడా ఉంటే బాగుండు అని చాలా సందర్భాల్లో అనుకుని ఉంటాము.కానీ ఆ సెలబ్రిటీలు కూడా తమ వైవాహిక జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను, బాధలను ఎదుర్కుంటూ నరకాన్ని అనుభవించి వచ్చినవారే అన్న విషయాన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి.
ఆ బాధలు పడలేక చివరకి భర్తతో విడిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.ఇలా భర్తతో గొడవలు పడి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిలో టాలీవుడ్ సింగర్ కౌసల్య కూడా ఒకరు.
కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం.నాగార్జున సాగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు.గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు.1999లో మీ కోసం సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా ఈవిడ మన ముందుకు వచ్చారు.ఎంతో పేరు, ప్రఖ్యాతలు ఉన్న కౌసల్య తన వైవాహిక జీవితంలో నరకం అంటే ఏంటో చవి చూశారట.ఆవిడ వైవాహిక జీవితం గురించి చూస్తే.తన చిన్ననాటి స్నేహితుడు, వృత్తిరీత్యా ఇంజనీరు అయిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఇంటర్ చదివే రోజులలోనే ప్రేమించి పెళ్లిచేసుకుంది.భర్తతో కొత్త జీవితాన్ని గడపాలని, ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది కౌసల్య.
మెట్టినింట్లో ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కన్నది.కానీ.
తన కలలు, ఆశలు అన్ని కూడా అడియాసలు అయ్యాయి.సగటు ఆడపిల్ల కన్నా దారుణంగా వేధింపులకు గురి అయింది.
ఇక ఆ వేధింపులు, భాదలు భరించలేక తన భర్త మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య 2015 నవంబరు 24న సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దాంతో కౌసల్య భర్తను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ చేసారు.ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ తన భర్తలో మార్పు రాకపోవటంతో అలాంటి సైకో తో కలిసి జీవించడం కన్నా విడిపోవడం ఉత్తమం అన్ని భావించింది.
భర్తతో విడిపోయి ప్రస్తుతం కుమారుడితో ఉంటుంది కౌసల్య.
ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కున్న సమస్యలను ఇలా తెలిపింది.తాను ఏదో ఒక క్షణిక ఆవేశంలో ఇలా విడాకులు నిర్ణయం తీసుకోలేదు.దాదాపు ఎన్నో బాధలు పడి, కన్నీళ్లు కార్చి నా గుండె బండ బారిపోయింది.
వైవాహిక జీవితంలో 6 సంవత్సరాల పాటు నరకం అంటే ఏంటో చూసాను.అంతకుమించి భరించడం నా వల్ల కాలేదు.
అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కౌసల్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తన పెళ్లయిన 16 రోజులకే పాపం కౌసల్యను కొట్టాడట అక్కడితో ఆగకుండా సభ్యత, సంస్కారం అన్నీ మర్చిపోయి అందరి ముందు తీవ్రమైన అసభ్య పదజాలం ఉపయోగించి తిట్టేవాడట.
అతడి ప్రవర్తన చూసిన తర్వాత కౌసల్య అత్తమామలు కూడా షాక్ అయ్యారు.కడుపున పుట్టిన కొడుకు ఏంటి ఇలా తయారు అయ్యాడని తల్లి తండ్రులు బాధ పడేవారని తెలిపారు.
అతడితో కలిసి ఉన్నంతసేపు స్వేచ్ఛ ఉండేది కాదు.కౌసల్య ఇష్టాలతో సంబంధం లేకుండా తన భర్త ఇష్టానుసారంగా ప్రవర్తించారట.
కట్టుకునే చీర విషయంలో, పెట్టుకునే బొట్టు విషయంలో కూడా అన్నీ అతనికి నచ్చినట్లు చేయాలనేవాడు.అయిన సరే సర్దుకు పోయింది కౌసల్య.
ఆ వేధింపుల మధ్య, హింస మధ్య ఉండటం తన వల్ల కాలేదు అందుకే విడిపోవాల్సి వచ్చింది అని కౌసల్య తెలిపారు.తన విషయంలో ఎన్ని చేసినా భరించింది.కానీ కొడుకు విషయంలో కూడా బాధ్యతగా ఉండేవాడు కాదు.అలాంటి వ్యక్తితో ఉండే కంటే విడిపోయి ప్రశాంతంగా బ్రతకడమే మేలు అనుకునే కొడుకుని తీసుకుని ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది కౌసల్య.
అంతేకాదు తన భర్త తనతో ఉన్నపుడే వేరే మహిళతో సంబంధం కూడా పెట్టుకున్నాడట.వారిద్దరికీ సంబంధించిన వార్తలు కూడా నేను చాలానే విన్నాను.ఒకసారి నా కొడుకు వాళ్ళిద్దర్నీ స్వయంగా చూశాడు.విడిపోవటానికి ఇంతకు మించి నాకు ఇంకా పెద్ద కారణం అవసరం లేదు అని కౌసల్య ఇంటర్వ్యూలో తెలిపారు.
కౌసల్య కు తన కొడుకే సర్వస్వం అని తెలిపారు.కౌసల్య కి మరొక వివాహం చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదని ఇంటర్వ్యూలో తెలిపింది.
.