హీరో అవసరం లేదు.. మాకున్న క్రేజ్ తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాం అంటున్న హీరోయిన్లు?

ఒకప్పుడు హీరోలని చూసి ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరేవారు.కానీ ఇప్పుడు మాత్రం కేవలం హీరోలను మాత్రమే కాదు హీరోయిన్ లను చూసి కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు అని చెప్పాలి.

 Heroines Who Are Giving Hits As Women Centric , Tollywood Heroines , Theaters ,-TeluguStop.com

అయితే ఇలా హీరో అవసరంలేదు తమ పాత్రలతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగళం అనుకుంటున్న హీరోయిన్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.ఇక అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజా హెగ్డే.అయితే తాను ఓకే చేసే సినిమాలో హీరో ఎవరు అని చూడటం కంటే తన పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ వుంది ఉంది అన్నది చూస్తుందట ఈ ముద్దుగుమ్మ.మిగతా ఏది పట్టించుకోవడం లేదట.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయంలో కూడా పూజాహెగ్డే ఇలాగే ఆలోచించిందట.అందుకే ఈ సినిమాలో హీరో అఖిల్ కంటే పూజా హెగ్డే కి మంచి పేరు వచ్చింది.ఇప్పుడు వరుస సినిమాలతో చరణ్ మహేష్ ప్రభాస్ లాంటి స్టార్ల సరసన నటిస్తోంది.

ఇక సాయి పల్లవి కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది.గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దగ్గరగా ఉంటుంది ఈ హీరోయిన్ ఇక సాయి పల్లవి ఏదైనా సినిమాలో ఉందంటే పక్కన ఏ స్టార్ హీరో కూడా అస్సలు కనిపించడూ.ఎందుకంటే ఈ అమ్మడు పర్ఫామెన్స్ ఆ లెవెల్ లో ఉంటుంది.సాయి పల్లవి కదా ఓకే చేసే కథల్లో తన పాత్ర గురించి మాత్రమే తెలుసుకుంటుందట.హీరో ఎవరు అన్న విషయాన్ని అంతలా పట్టించుకోదట ఈ నేచురల్ బ్యూటీ ఇలా తన నటనతోనే ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించింది సాయి పల్లవి అనడంలో అతిశయోక్తి లేదు.

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార.

ఈ హీరోయిన్ కూడా ఏది పడితే అది చేయకుండా కేవలం పాత్రకి స్కోప్ ఉంటేనే చేయడానికి ఓకే చెబుతోంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది.ఇక ఇలా పాత్రలోనే కాదు పారితోషికం లో కూడా స్టార్ హీరోలతో పోటీ పడుతోంది నయనతార.

మహానటి సూపర్ హిట్ తో తన కోసమే దర్శకులు ప్రత్యేకమైన కథలు రాసేలా సంపాదించుకుంది కీర్తి సురేష్.ఇక ఇటీవల కాలంలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తోంది.ఇలా తన సినిమాల్లో హీరో అవసరం లేదు ప్రేక్షకులను థియేటర్లకు నటనతో రప్పిస్తాను అదే కాన్ఫిడెన్స్తో ఉంది ఈ హీరోయిన్.ఇప్పుడు మహేష్ బాబు తో సర్కారు వారి పాట చేస్తుంది.

ఇక కెరీర్ మొదటి నుండి కూడా విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన శృతిహాసన్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తుంది.పాత్ర బాగుండాలి కానీ కాస్త పారితోషికం తక్కువ అయినా సరే ఓకే చెప్పేస్తుందట.

ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఇలా శృతి హాసన్ ని చూడడానికి ప్రేక్షకులు కు వచ్చేలా క్రేజ్ సంపాదించుకుంది.

హీరోలు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి అని అనుకుంటున్న సమయంలో హీరో అవసరం లేదు పాత్రకు ప్రాణం పోసే హీరోయిన్ ఉంటే చాలు అంటూ నిరూపించింది అనుష్క అరుంధతి నుంచి మొన్నటి భాగమతి వరకు కూడా హీరో అవసరం లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టవచ్చు అని నిరూపించింది ఈ సీనియర్ హీరోయిన్.

Heroines Who Are Giving Hits As Women Centric

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube