టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Star hero Jr.NTR ) గురించి మనందరికీ తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.చివరగా ఎన్టీఆర్ దేవర మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి సెట్ అవ్వడంతో ఇప్పుడు అదే ఊపుతూ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు.ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలలో వార్2 సినిమా( War2 movie ) కూడా ఒకటి.
ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా నుంచి ఒక లోటు తీర్చబోతున్నారట.
అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీని మళ్లీ ఎప్పుడు ప్రదర్శించలేదు.ఈ లోటుని వార్ 2 లోని ఇంట్రడక్షన్ ఫైట్ సీన్లో ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపించబోతున్నట్టు ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ మాస్ యాక్షన్ బిట్ పది నుంచి ఇరవై నిమిషాల మధ్య ఉంటుందని తెలుస్తోంది.వార్ 2 ఈ సమ్మర్ ఎండ్ లో, ఆగస్ట్ 14న రాబోతోంది.విశ్వంభర తర్వాత రాబోయే పెద్ద సినిమా ఇదే.హిందీ సినిమా అయినా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ఎన్టీఆర్ ఒక హీరోగా నటించడం వల్ల తెలుగు నాట కూడా భారీ క్రేజ్ ఉంది.తెలుగులో భారీగా విడుదలకు సన్నాహాలు, చర్చలు జరుగుతున్నాయి.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి.సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించినప్పుడు థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం.మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.