సయీ మంజ్రేకర్( Saiee Manjrekar ).ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదు.అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ కాస్త డేంజర్ జోన్ లో ఉంది అని చెప్పాలి.
కాబట్టి ఇంకో ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ పడటం అవసరం.లేదంటే ఆమె కెరియర్ కష్టాల్లో పడడంతో పాటుగా అవకాశాలు రావడం కూడా చాలా కష్టం అవుతుంది అని చెప్పాలి.
అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక సినిమాపై ఆశలు అన్ని పెట్టుకుంది.ఆ ఒక్క సినిమా హిట్ అయితే ఈమె మళ్లీ ఫామ్ లోకి వస్తుంది అని చెప్పాలి.

ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి( Arjun Son of Vyjayanthi ).ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన పెట్టుకుంది.యూనిట్ లో అందరి కంటే సయీ మంజ్రేకర్ కే ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం ఉంది.గని లాంటి డిజాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత మేజర్ మూవీతో కాస్త కోలుకుంది.అయితే ఆ వెంటనే వచ్చిన స్కంద సినిమా భారీగా గట్టిగా దెబ్బకొట్టింది.
స్కంద సినిమా దెబ్బకు ఈ ముద్దుగుమ్మకు అవకాశాలే తగ్గిపోయాయి.

కానీ ఎట్టకేలకు కల్యామ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్న సన్నాఫ్ వైజయంతి మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈమె కెరియర్ మళ్ళీ ఘాడిలో పడాలన్నా అవకాశాలు ఎక్కువగా రావాలి అన్నా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.దానికి తోడు ప్రస్తుతం తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ లకు కాస్త కొరకు ఎక్కువగానే ఉంది.
ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తెలుగులోనే అవకాశాలు రావడం ఖాయం అని చెప్పాలి.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.