టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( Director SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జక్కన్న ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలిచాయి.
కాగా జక్కన్నతో సినిమాలు చేయడానికి హీరోస్ కూడా సై అంటున్నారు.ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఈ మూవీ పాన్ వరల్డ్ నే ఈ సినిమా షేక్ చేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
మహేష్ ని హాలీవుడ్ హీరోలకు ధీటుగా అక్కడ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు.

మహేష్ లో ఉన్న హాలీవుడ్ హీరో( Hollywood hero ) లుక్ అప్పిరియన్స్ కాన్పిడెన్స్ తో రాజమౌళి నమ్మకంగా వెళ్లిపోతున్నాడు.ఆర్ఆర్ఆర్ విజయంతోనే జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజాలతో ప్రశంలందుకున్నారు.ఎస్ఎస్ఎంబీ 29( SSMB 29 ) తర్వాత అలాంటి దిగ్గజాలెంతో మంది దిగొచ్చి జక్కన్నని ప్రశంసల్లో ముంచెత్తడం ఖాయం.
దీంతో దర్శకుడిగా రాజమౌళి బాధ్యత రెట్టింపు అవుతుంది.ఆపై తాను ఏ సినిమా చేసినా? వరల్డ్ లోనే ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉంది.అయిత ఈ ఫేజ్ లో రాజమౌళి హీరో ఎవరవుతారు? ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఇప్పటికే డైరెక్ట్ చేసేసారు.ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ తర్వాత మహేష్ కూడా వాళ్ల సరసన చేరిపోతాడు.

ఆ తర్వాత రాజమౌళి డైరెక్టర్ చేసే హీరో ఎవరైనా అతడంత అదృష్ట వంతుడు మరొకరు ఉండరు.రాజమౌళి బ్రాండ్ తో నే వరల్డ్ లో ఫేమస్ అవ్వడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి.ఆ హీరో ఎవరైనా కానీ అది టాలీవుడ్ నుంచే అవుతాడు? అన్న దాంట్లో సందేహం లేదు.కానీ ఆ లక్కీ స్టార్ ఎవరవుతాడు? అన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం.అయితే రాజమౌళి నెక్స్ట్ చేయబోయే సినిమా ఇద్దరు హీరోలు మాత్రమే కనిపిస్తున్నారు.అందులో ఒకరు నాని కాగా మరొకరు అల్లు అర్జున్.ఇప్పటికే అల్లు అర్జున్ పాని నీస్టార్ అయిన విషయం తెలిసిందే.మరోవైపు రాజమౌళి నాని మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది.
మరి రాజమౌళి మహేష్ బాబు సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా నుంచి ఎవరితో చేస్తారో చూడాలి మరి.అయితే ఎక్కువ శాతం నాని పేరే గట్టిగా వినిపిస్తోంది.ఒకవేళ ఈ ఇద్దరు హీరోలు కాకుండా మరొక హీరోని ఎంచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.