మటన్, చికెన్, ఫిష్.నాన్ వెజ్ ప్రియులు అమితంగా ఇష్టపడి తినేది వీటినే.ఈ మూడూ ప్రత్యేకమైన రుచి కలిగి ఉండటమే కాదు.ప్రత్యేకమైన పోషకాలను సైతం కలిగి ఉంటాయి.అందుకే ఈ మూడు ఆరోగ్యానికి మంచివే.అయితే ఈ మూడిటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది.? అన్నది మాత్రం చాలా మందికి తెలయదు.సాధారణంగా చికెన్, మటన్‌లలో ప్రోటీన్‌తో పాటుగా ఫ్యాట్స్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి.
అందు వల్ల, వీటిని పరిమితికి మించి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది.
దాంతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అలాగే చికెన్, మటన్‌లను ఓవర్‌గా తీసుకుంటే ఫ్యాటీ లివర్, డయాబెటిస్, కాన్సర్ తదితర సమస్యలు వచ్చే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.అయితే ఫిష్‌తో ఇటువంటి సమస్యలేమి ఉండవనే చెప్పాలి.
చేపల్లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి.ప్రోటీన్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే వారంలో మూడు సార్లు చేపలను ఎటువంటి భయం లేకుండా లాగించేయవచ్చు.చేపలను తీసుకోవడం వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి పోయి గుండె ఆరోగ్యంగా మారుతుంది.డిప్రెషన్, ఒత్తడి వంటి మానసిక సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.మెదడు మరింత చురుగ్గా మారుతుంది.మతిమరుపు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.
అంతేకాదు, పెద్దపేగు క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ చేపలు అద్భుతంగా సహాయపడతాయి.
వారంలో రెండు లేదా మూడు సార్లు చేపలను తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది.నిద్రలేమి సమస్య తగ్గు ముఖం పడుతుంది.వ్యధి నిరోధక వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది.ఇక ఫైనల్‌గా మటన్, చికెన్ కంటే ఫిష్ హెల్త్‌కి బెస్ట్ అని చెప్పొచ్చు.