ప్రస్తుత సమాజంలో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి అని కచ్చితంగా చెప్పవచ్చు.రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం, నూనె ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం, ఇతర చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతోంది.
ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు మలబద్ధకం సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఆహారంలో మార్పులు చేయడం ఎంతో అవసరం.
పెరుగు, అరటిపండును సరిగ్గా ఉపయోగిస్తే మలబద్ధక సమస్య నుంచి కచ్చితంగా బయటపడవచ్చు.ఈ రెండు మార్కెట్లో చాలా తక్కువ దొరికే లభిస్తాయి.
మలబద్ధకంతో బాధపడే వారు అల్పాహారంలో అరటిపండు, పెరుగు ఉపయోగించాలి.ఈ రెండు ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇది మలబద్ధక సమస్యను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.అంతే కాకుండా విటమిన్లు, క్యాల్షియం, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.అరటిపండులో ఐరన్, విటమిన్స్, ఫైబర్ కూడా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అల్పాహారం సమయంలో ఈ రెండు ఆహారాలను తినడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల రోజంతా శరీరానికి శక్తి లభించే హుషారుగా ఉంటారు.అల్పాహారం లో పెరుగును చేర్చుకుంటే ఇది ఎముకలకు ఎంతో బలాన్ని అందిస్తుంది.
అంతే కాకుండా దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ రెండు మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.కాబట్టి సాధారణ ప్రజలు కూడా వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
రాబోయే ఎండా కాలంలో ఈ రెండిటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.







