కేరళలోని చిన్ని కృష్ణుడికి ఆకలెక్కువంట.. అందుకే 7 సార్లు నైవేద్యం!

కేరళలోని తిరువరప్ప శ్రీ కృష్ణుడి ఆలయంలో ఉన్న చిన్ని కృష్ణుడికి ఆకలి ఎక్కువంట.అందుకే ఆ దేవుడికి రోజుకు ఏడు సార్లు మహా నైవేద్యాన్ని సమర్పిస్తారట.

 Kreala Thiruvarappa Sri Krishna Temple Special Story , Devotional, Kerala Krish-TeluguStop.com

ఈ నైవేద్యం చాలా రుచి కరంగా కూడా ఉంటుంది.ఆలయానికి వచ్చిన భక్తులందరూ.

కచ్చితంగా నైవేద్యాన్ని స్వీకరించాలట.అది భగవంతుడి అభీష్టమట.

ప్రసాదం పంచి పెట్టాక ఒకటికి పది సార్లు అందరికీ వచ్చిందా అంటూ అక్కడి ఆలయ అర్చకులు అడుగుతారట.స్వామి వారి ముందు ఉంచిన నైవేద్యం ప్రతీ సారి కాస్త తగ్గిపోవడం అక్కడి గుడి ప్రత్యేకం.

అంతే కాదండోయ్ స్వామి వారికి విశ్రాంతి కూడా కొన్ని నిమిషాలేనట.రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసిన కాసేపటికే మళ్లీ ఆలయాన్ని తెరుస్తారట.

ఒకవేళ తాళం రాకపోతే దాన్ని పగలగొట్టేందుకు ఆలయ అర్చకుల్లో ఒకరు గొడ్డలి పట్టుకుని రెడీగా ఉంటారట.గ్రహణ సమయాల్లో కూడా ఆలయాన్ని మూసివేయరట.

గతంలో ఓ సారి గ్రహణ సమయంలో మూసివేస్తే… స్వామివారు ఆకలితో బాధపడటం వల్ల నడుముకి కట్టిన ఆభరణం వదులైపోయిందట.అందుకే అప్పటి నుంచి ఆలయాన్నిఎప్పుడూ తెరిచే ఉంచుతారు.

ఈ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

అలాగే కంసుడిని వధించేటప్పుడు కృష్ణుడు ప్రత్యేకమైన ఢంకాను మోగించాడట.

అలాంటి ఢంకానే ఇక్కడ కూడా ఉందట.ఆలయ ప్రాంగణంలో గణపతి, భూతనాద, శివ, భగవతి, సుబ్రహ్మణ్య, యక్షి ఆలయాలు కూడా ఉన్నాయి.

పూరం ఉత్సవాల సందర్భంగా పెద్ద పెద్ద ఏనుగులతో ప్రదర్శనను ఇప్పిస్తారు చిన్నారులంతా బాల కృష్ణులు వేషాల్లో తిరుగుతూ.కనివిందు చేస్తారు.

అలాంటి ఆలయాన్ని మీకూ చూడాలనిపిస్తోంది.అయితే ఇంకెందుకు ఆలస్యం కేరళకు వెళ్లండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube