తిరుమల తిరుపతి దేవస్థానమును( Tirumala Tirupati Temple ) జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు కోరుతూ ఉంటారు.కొందరు ప్రతి ఏడాది కచ్చితంగా ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటూ ఉంటారు.
తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు.వీటిలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి లాంటివి ఎన్నో ఉన్నాయి.
వీటిలో శ్రీకాళహస్తి ( Srikalahasti )దేవాలయంలోకి వెళ్లిన తర్వాత నేరుగా ఇంటికి రావాలని మరో దేవాలయానికి వెళ్ళకూడదని కొందరు చెబుతూ ఉంటారు.అసలు ఈ దేవాలయంలోకి వెళ్లిన తర్వాత మరో దేవాలయంలోకి ఎందుకు వెళ్ళకూడదు.
అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం, వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సంవత్సరంలో కొన్ని రోజులు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది.ఇంటి దగ్గరలో ఉండే దేవాలయానికి మాత్రమే కాకుండా తీర్థయాత్రలకు వెళ్లడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుందని చాలా మంది మానసిక నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో చాలా మంది తిరుమల కు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అయితే శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత శ్రీకాళహస్తి కూడా వెళ్లాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.

తిరుపతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి దేవాలయం ఉంటుంది.ఈ దేవాలయం నిర్మాణం ఎంతో వైభవంగా ఉంటుంది.ఈ దేవాలయంలో పంచభూతాల్లో ఒకటైన వాయు లింగం ప్రదర్శించబడింది.
దీనిని ఐదవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలలో ఉంది.ఈ దేవాలయానికి నాలుగు దిక్కులు గోపురాలు ఉంటాయి.120 అడుగుల ఎత్తులో ఉన్న రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు( Sri Krishna Deva Raya ) కట్టించారు.ఇంకా చెప్పాలంటే శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే రాహు కేతుల దోషం ఉంటే పోతుంది.
దోషా నివారణకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది.ఇక్కడ పాపాలను వదిలేసి తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలి.మరో దేవాలయానికి వెళ్తే దోష నివారణ జరగదు అని పండితులు చెబుతున్నారు.అందువల్ల ఈ దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి అని చెబుతున్నారు.
గ్రహణ సమయంలోను ఈ దేవాలయం తెరిచి ఉంటుంది.మిగతా దేవాలయాలు మూసివేస్తే ఈ దేవాలయంలో మాత్రం రోజంతా పూజలు చేస్తూ ఉంటారు.