తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం ప్రేక్షకులకు ఎస్వీ కృష్ణారెడ్డి గురించి అంతగా తెలియకపోవచ్చు.
అప్పట్లో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రణ వేసుకున్నారు ఎస్ వి కృష్ణారెడ్డి.తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు.
హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఎస్ వి కృష్ణారెడ్డి.ఇకపోతే సూపర్ సార్ కృష్ణ అంటే ఎస్వీ కృష్ణారెడ్డికి చాలా అభిమానం.
కృష్ణ తో కలిపి ఎన్నో సినిమాలు చేశారు ఎస్ వి కృష్ణారెడ్డి.
ఇకపోతే కృష్ణతో కలిసి చేసిన సినిమాలలో నెంబర్ వన్ సినిమా కూడా ఒకటి.గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎస్ వి కృష్ణారెడ్డి ఈ నెంబర్ వన్ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నెంబర్ వన్ సినిమా గురించి కృష్ణని సంప్రదించినప్పుడు కేవలం ఒకే ఒక్క సీన్ చెప్పారట కృష్ణారెడ్డి.
వెంటనే కృష్ణ బాగుంది సినిమా చేద్దాం అన్నారట.మిగిలిన కథ రెడీగా ఉందా అని అడిగితే లేదు మీకు తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తాను అని చెప్పగా సరే అని అన్నారట.
ఆ ఒక్క సీన్ చాలు సినిమా హిట్ అవ్వడానికి కథ రెడీ చేసుకో అని చెప్పారట.
అలాగే ఈ సినిమా టైటిల్ విషయం లోనూ కొన్ని అభ్యంతరాలు కూడా ఎదురయ్యాయట.ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలు చాలా మంది ఉన్నారు.కృష్ణగారికే ఆ టైటిల్ పెట్టడం పై చాలా మంది తనను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి.
కానీ తన సినిమా కథ ప్రకారం అదే టైటిల్ కరెక్ట్ గా ఉంటుంది.సినిమాలో కుటుంబ బాధ్యతలు తీసుకునే కొడుకే నెంబర్ వన్.అలా నా సినిమాకు నెంబర్ వన్ అని టైటిల్ పెట్టాం అని క్లారిటీ అని చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి.