అనిల్ రావిపూడి( Anil Ravipudi ) నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా మంచి విజయాలను కూడా సాధించాయి.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు.

ప్రేక్షకుల నుంచి ఆయనకి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనే కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి.మిగతా దర్శకులతో పోల్చుకుంటే ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఉంటాయి.ఇక కమర్షియల్ సినిమా చేసినప్పటికీ ఆయన ఒక వినూత్నమైన ధోరణిని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.
మరి ఇదిలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunnam ) సినిమాతో 300 కోట్ల కలెక్షన్లను రాబట్టబోతున్నాం అంటూ ఆయన సందడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరి ఇప్పటికైనా ఆయన ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.కాబట్టి ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లకు పైన వసూళ్లను రాబట్టి తను అనుకున్నట్టుగానే ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లోకెళ్ల ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాతో దిల్ రాజు( Dil Raju ) కూడా భారిగా లాభాలు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి… గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో వచ్చిన నష్టాలను ఈ సినిమాతో కవర్ చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి…మరి వీళ్ళ కాంబోలో మరికొన్ని సినిమాలు రావాలని ప్రతి ప్రేక్షకుడు కూడా కోరుకుంటున్నాడు…
.