నేటి ఆధునిక కాలంలో మధుమేహం లేదా షుగర్ వ్యాధి గ్రస్తులు రోజు రోజుకు పెరిగి పోతున్నారు.ఇంతకు ముందు యాబై, అరవై ఏళ్లు దాటిన వారిలోనే మధుమేహం కనిపించేది.
కానీ, ప్రస్తుత రోజుల్లో యుక్త వయసు వారు సైతం షుగర్ వ్యాధి బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.
అయితే ప్రారంభ దశలో మధుమేహాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.దాన్ని సంపూర్ణంగా నివారించుకోవచ్చు.
ఇదిలా ఉంటే.పాదాల్లో కనిపించే కొన్ని కొన్ని లక్షణాలను బట్టీ మధుమేహాన్ని గుర్తించ వచ్చు.
మరి ఆ లక్షణాలు ఏంటీ.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.పాదాలు తరచూ వాపులు, నొప్పులు రావడం అనేది షుగర్ వ్యాధికి సంకేతంగా చెప్పుకోవచ్చు .మధుమేహం బారిన పడితే రక్తం సరఫరా సరిగ్గా జరగదు.ముఖ్యంగా పాదాల్లో రక్త ప్రసరణ బాగా తగ్గి పోతుంది.అందు వల్లనే వాపులు రావడం, నొప్పి పుట్టడం వంటివి జరుగుతుంటాయి.
అలాగే పాదాల తిమ్మిర్లు కూడా షుగర్ వ్యాధికి సంకేతమే.అయితే పాదాల తిమ్మిర్లు అప్పుడప్పుడూ వస్తే ఎలాంటి సమస్య ఉండదు.కానీ, తరచూ పాదాలు తిమ్మిర్లు పుడుతుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
పాదాలకు చలనం లేకపోవడం సైతం షుగర్ వ్యాధికి ఆరంభ లక్షణంగా చెప్ప వచ్చు.
పాదాలకు దెబ్బ తగిలినా ఎటువంటి నొప్పి లేకుంటే తప్పకుండా అనుమానించాల్సిందే.ఇక మధుమేహం వ్యాధి బారిన పడితే ఏ గాయమూ త్వరగా తగ్గదు.
అందులోనూ పాదాలకు అయిన గాయాలు అస్సలు మానవు.ఇలా జరిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి షుగర్ వ్యాధికి సంబంధించిన టెస్ట్‌లు చేయించు కోవడం ఎంతో అవసరం.