ఆ ఘటనలో బన్నీ నిందించాల్సిన అవసరం లేదన్న బోనీ కపూర్.. తప్పు లేదంటూ?

సంధ్య థియేటర్( Sandhya theater ) తొక్కిసలాట ఘటన బన్నీ కెరీర్ ను ఒక విధంగా ప్రమాదంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.ఈ సంఘటన విషయంలో సినీ అభిమానుల నుంచి, సినీ సెలబ్రిటీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 Boney Kapoor Comments About Bunny Issue Details Inside Goes Viral In Social Medi-TeluguStop.com

బోనీ కపూర్ , అల్లు అర్జున్( Boney Kapoor, Allu Arjun ) ఘటన గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.సౌత్ ప్రేక్షకులకు సినీ తారలపై అభిమానం ఎక్కువని వెల్లడించారు.

అజిత్ యాక్ట్ చేసిన ఒక సినిమాకు నేను అర్ధరాత్రి షోకు వెళ్లానని ఆయన తెలిపారు.

అక్కడ థియేటర్ దగ్గర 20 వేల మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

సినిమా హాల్ దగ్గర నేను అంతమందిని చూడడం అదే తొలిసారి అని బోనీ చెప్పుకొచ్చారు.సినిమా పూర్తయ్యాక 4 గంటలకు బయటకు వచ్చే సమయానికి కూడా ఎంతోమంది ప్రేక్షకులు బయట ఎదురుచూస్తున్నారని బోనీ కపూర్ పేర్కొన్నారు.

స్టార్ హీరోల ( Star heroes )సినిమాల రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ ఇలానే వస్తారని ఆయన తెలిపారు.

Telugu Allu Arjun, Boney Kapoor, Revathi, Trivikram-Movie

జనాలు ఎక్కువమంది వచ్చిన కారణంగా సంధ్య థియేటర్ దగ్గర అలాంటి ఘటన జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.ఇందులో బన్నీని నిందించాల్సిన అవసరం లేదని బోనీ కపూర్ అన్నారు.ఈ విషయంలో బన్నీ తప్పు లేదని బోనీ కపూర్ తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు.

బన్నీ ఇప్పటికే రేవతి( Revathi ) కుటుంబానికి కోటి రూపాయల సహాయం చేసిన సంగతి తెలిసిందే.

Telugu Allu Arjun, Boney Kapoor, Revathi, Trivikram-Movie

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఏకంగా 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.హారిక హసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

బన్నీని అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.బన్నీ రెమ్యునరేషన్ ప్రస్తుతం 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube