మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి-ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీకి చెందిన మేకల కాపరి ,గిరిజనుడయిన భూక్య నరేష్ నాయక్ ( 30 ) పై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.ఎలుగు బంటి దాడిలో నరేష్ నాయక్ ఎడమ చేతికి తీవ్ర గాయం అయింది.

 Bear Attacks Goat Herder, Shifted To Private Hospital, Bear Attacks ,bear Attack-TeluguStop.com

గుంటపల్లి చెరువు తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలను మేపుతుండగా సమీపము లోని చెట్ల పొదలలో పిల్లల తో ఉన్న ఎలుగుబంటి ఒక్క సారిగా నరేష్ పై దాడి చేసింది.వెంటనే గమనించిన నరేష్ తన వద్ద ఉన్న గొడ్డలితో ఏలుగు బంటి పై ఎదురు దాడి కి దిగి తనకు తాను కాపాడు కోవడంతోప్రాణాపాయం తప్పింది.

ఎలుగు బంటూ దాడిలో గాయపడ్డ నరేష్ ను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ఎలుగుబంటి దాడి లో గాయపడిన నరేష్ నాయక్ ను ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube