నటి కస్తూరి శంకర్.ఇప్పటి జనరేషన్ వారికి ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమే.కానీ గృహలక్ష్మి సీరియల్ తులసి అంటే గుర్తుపట్టేస్తారు.ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాల కన్నా కూడా ఇటీవల కాలంలో బుల్లితెరపై సీరియల్స్ లో అలాగే టెలివిజన్ హోస్ట్ గా ఉంటూ పలు సంచనాలకు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు ఈ జనరేషన్ యువత.
అయితే ఈమె సాధించిన విజయాల కన్నా తగిలించుకున్న వివాదాలే ఎక్కువ.సినిమాల్లోకి రాకముందే స్టేట్ లెవెల్ హాకీ ఛాంపియన్ గా అలాగే ఎయిర్ ఫోర్స్ వింగ్ లో RD క్యాడెట్ గా ముఖ్యమైన సభ్యురాలుగా కొనసాగిన కస్తూరి బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదానికి చక్కగా సరిపోతుంది.
ఆ తర్వాత ఆమె మోడలింగ్ లోకి ప్రవేశించి సినిమాల్లో సైతం రాణించింది.ఇక 1991లో సినిమా కెరియర్ ప్రారంభించిన కస్తూరి కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించింది.1992 లో మిస్ మద్రాసుగా ఎంపికయ్యింది.తెలుగులో నాగార్జున సరసన కూడా అన్నమయ్య సినిమాలో నటించింది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎక్కువగా కనిపించింది.ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్ గా రాణించకపోవడంతో ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రల్లో కూడా నటించి ఆ తర్వాత టెలివిజన్ హోస్ట్ గా కూడా మారింది.
ఇక బీబీసీ మాస్టర్ మైండ్ గా 2000 సంవత్సరంలో ఎంపిక అయ్యింది.

ఎవరి గురించి అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం కస్తూరి నైజం.అందుకే తనకు సంబంధం లేకపోయినా, తనకు అవసరం లేకున్నా తమిళ హీరోలపై, దర్శకులపై నోరు పారేసుకోవడం కూడా ఆమెకు అలవాటు.ఆలా నోరు పారేసుకోవడం వలన ఎన్నో ప్రాజెక్ట్స్ సైతం పోగొట్టుకుంది.
ఇక ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే అక్కడ కస్తూరి ఖచ్చితంగా ఉంటుంది.అన్ని విషయాల్లో తానే ముందుగా వేలు పెడుతుంది.
ఇక 2000 సంవత్సరంలో ఎన్ఆర్ఐ డాక్టర్ ని పెళ్లి చేసుకున్న కస్తూరి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు.
కుమార్తె క్యాన్సర్ తో మూడేళ్ల పాటు పోరాటం చేసి బ్రతికి బట్ట కట్టింది.ఇక అప్పటి నుంచి ఆమె కాంట్రవర్సీలకు అడ్రస్ గా మారింది.
ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఆమె న్యూడ్ గా ఫోటోషూట్ చేయడం కూడా అప్పట్లో వివాదం అయింది.