సాధారణంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.మందు బాబులకు ఒక శుభవార్త వచ్చినట్లే… మద్యానికి( Alcohol ) బానిసైన వ్యక్తి తన జీవితం సాంకేతికంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఎలా నాశనం చేస్తోందో చాలామందికి తెలిసిన విషయమే.
అలాగే మద్యం వల్ల వస్తే అంతటి మానసిక, శారీరక దుస్థితి గురించి చాలా మందికి తెలియదు.మద్యం మత్తులో కొందమంది చేసే పనులు చాల మందికి అనేక ఇబ్బందులు వస్తాయి.
విద్యుత్ స్తంభం ఎక్కడం, రోడ్డు ప్రమాదాలు, చుట్టూ ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితి మాత్రమే కాకుండా.ప్రజల ఆరోగ్యం, భద్రత మీద ప్రభావితం చేస్తాయి.
అచ్చం అలంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో( Manyam District ) పాలకొండ మండలం ఎం.సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు.ఇక అతనికి మద్యం తాగపోతే బయటికి కూడా వెళ్ళలేడు .ఆ వ్యక్తి తాజా మద్యం మైకంలో ఏకంగా విద్యుత్ స్తంభం( Current Pole ) ఎక్కాడు.చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనప్పటికీ అతడు ఒప్పుకోలేదు.అదే మైకంలో అలానే స్తంభం ఎక్కాడు.దీంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సరఫరాను నిలిపి వేయాలని కోరారు.ఆ తర్వాత విద్యుత్ స్తంభం ఉన్న తీగలపై పడుకున్నాడు.
ఇలా చాలాసార్లు అతడు తనదైన విన్యాసాలు చేశాడు.
ఈ తరుణంలో అక్కడి స్థానికులు స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దింపారు.అదృష్టవశాత్తూ స్థానికులు సమయంలో స్పందించి అతడిని కిందకి దింపి ప్రాణాలను కాపాడారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వగా అది కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇక ఈ వైరల్ వీడియోను( Viral Video ) చూసిన కొంతమంది నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.
ఇక మరికొందరు ఇలా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇంట్లో వారిని కూడా పట్టించుకోకుండా ఇలా విచిత్ర ప్రయత్నాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరి అయితే వివిధ రకాల ఏమోజీలతో వారి భావనను తెలియజేస్తున్నారు.