మందారం అలంకరణకు మాత్రమే కాదు వెయిట్ లాస్ కు సహాయపడుతుంది.. తెలుసా?

ఎర్ర మందారం( Red Hibiscus ) చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మామూలుగా ఎర్ర మందారాన్ని పూజలో అలంకరణకు వాడుతుంటారు.

 Red Hibiscus Will Help To Lose Weight Quickly Details, Red Hibiscus, Weight Los-TeluguStop.com

అయితే అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎర్ర మందారం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ కు( Weight Loss ) ఎర్ర మందారం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ బరువు తగ్గడం కోసం ఎర్ర మందారాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) రెండు దంచిన యాలకులు,( Cardamom ) నాలుగు లవంగాలు,( Cloves ) రెండు బిర్యానీ ఆకులు, అర టీ స్పూన్ జీలకర్ర మరియు ఒక ఎర్రమందారం రేకులు వేసుకుని మరిగించాలి.చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు బాయిల్ చేయాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Red Hibiscus, Redhibiscus-Telugu Health

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని మిక్స్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.నిత్యం ఈ మందారం డ్రింక్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

శరీరంలో పేరుకుపోయిన అదనపు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.దాంతో మీరు అధిక బరువు నుంచి బయట పడతారు.

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ( Fat ) కరిగించే సత్తా కూడా ఈ మందారం డ్రింక్ కు ఉంది.

Telugu Tips, Latest, Red Hibiscus, Redhibiscus-Telugu Health

పైగా వర్షాకాలంలో ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ డ్రింక్ ను తీసుకోవ‌డం చాలా ఉత్తమం.

ఇది రక్తపోటును అదుపులోకి తెస్తుంది.మరియు గుండె ఆరోగ్యాన్ని సైతం ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube