ముఖ్యంగా చెప్పాలంటే వయసులో పెద్ద వారి దగ్గర నుంచి చిన్న వారి వరకు సెన్సిటివిటీ సమస్య( Sensitivity problem )తో ఇబ్బంది పడుతున్నారు.ఈ సెన్సిటివిటీ కారణంగా చల్లని పదార్థాలు, తీయని పదార్థాలు, వేడి పదార్థాలు తిన్నా కూడా పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సార్లు ఈ నొప్పి తో ఏమీ తినలేరు.వీటి వల్ల దవడ పండ్లు ఊడిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
ఈ సమస్య ఉన్నవారు ఐస్ క్రీములకు దూరంగా ఉండటమే మంచిది.అంతే కాకుండా పళ్ళ సెన్సిటివిటీ ఉన్న వారు హాయిగా ఎలాంటి ఆహార పదార్థాలను కూడా తినలేక పోతూ ఉంటారు.
అలాగే ఏమి తాగలేరు.కొందరికి తీపి పదార్థాలు ఇష్టమైన సరే ఈ నొప్పి కారణంగా వాటికి దూరంగా ఉంటారు.అయితే ఈ సమస్యను మీ వంటింటి చిట్కాలను ఉపయోగించి దూరం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్య కు ఉప్పు నీళ్లు ( Salt water )బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇది దంత సమస్యలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా ఉప్పులో ఉండే క్రిమినాశక గుణాలు మంటను తగ్గించేందుకు .ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంకా చెప్పాలంటే పంటి నొప్పి ( toothache )నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు రెండు సార్లు ఉప్పు నీటి తో పుక్కులించాలి.ఇది మీ నోటి ఆరోగ్యానికి అద్భుతమైన మౌత్ వాష్ గా కూడా పని చేస్తుంది.ఇందుకోసం ఒక గ్లాస్ వేడి నీటిలో సగం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని నోటిలో వేసుకొని 30 సెకండ్ల పాటు పుక్కలించాలి.
ఇలా చేయడం వల్ల ఆ సెన్సిటివిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.