అందాన్ని పాడు చేయడంలో డార్క్ సర్కిల్స్(Dark Circles) ముందు వరుసలో ఉంటాయి.చర్మం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్న కూడా కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను పోగొట్టుకునేందుకు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.అయితే పైసా ఖర్చు లేకుండా డార్క్ సర్కిల్స్ ను ఇంట్లోనే ఈజీగా వదిలించుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ని ఫాలో అవ్వండి.
టిప్-1(Tep-1): ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు(Turmeric) వేసి బ్లాక్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న పసుపులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేసుకున్న ఐ మాస్క్(Eye Masks) ను వాటర్ తో తొలగించాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా మాయం అవుతాయి.
టిప్ 2(Tep-2): ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్(Aloe vera gel) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఈ క్రీమ్ ను ఉపయోగించిన కూడా డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.
ఇక ఈ టిప్స్ ను ఫాలో అవ్వడంతో పాటు డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గడానికి కంటి నిండా నిద్ర(Eyes full of sleep) ఉండేలా చూసుకోండి.స్ట్రెస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండండి.పోషకాహారం తీసుకోండి.మరియు రోజుకు 8 గ్లాసుల వాటర్ ను తప్పకుండా తాగండి.