తినేందుకు రుచిగా, కంటికి ఇంపుగా ఉంటేనే ఏ ఆహారాన్ని అయినా ఇష్టపడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాలు మాత్రం నలుపు రంగులో ఉంటాయి.
ఇవి చూసేందుకు అందంగా లేకపోయినా.బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.
అలాగే ఆరోగ్యానికి అనేక లాభాలను చేకూరుస్తాయి.మరి ఆ బ్లాక్ ఫుడ్స్ ఏంటీ.? వాటిని తీసుకోవడం వల్ల ఏయే ప్రయోజనాలను పొందొచ్చు.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.

నల్ల నువ్వులు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.తరచూ నల్ల నువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే గనుక ఎముకలు గట్టిగా మారతాయి.ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది రక్త హీనత సమస్య దూరం అవుతుంది.
మరియు వీటిలో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం ఫ్రీ ర్యాడికల్స్‌ను అంతం చేసి శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డు కట్ట వేస్తుంది.
నల్ల వెల్లుల్లి.
ఇది చూసేందుకు ఆకట్టుకునే విధంగా లేకపోయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కాలేయ పని తీరు మెరుగు పడుతుంది.
బ్లెడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.మరియు అల్జీమర్స్ వ్యాధి వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.

నల్ల బియ్యం కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను అందిస్తుంది.తెల్ల బియ్యంకు బదులుగా నల్ల బియ్యాన్ని తింటే వెయిట్ లాస్ అవుతారు.కంటి చూపు పెరుగుతుంది.మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ఒకవేళ మధుమేహం ఉన్నా.బ్లెడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పకుండా ఉంటాయి.
ఇక ఇవే కాకుండా బ్లాక్ బెర్రీస్, బ్లాక్ గ్రేప్స్, బ్లాక్ బీన్స్, బ్లాక్ టీ వంటివి సైతం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.కాబట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.