ఎండ వల్ల న‌ల్ల‌గా మారిన చేతులు, పాదాల‌ను ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!

ప్రస్తుతం వేసవికాలంలో( Summer ) ఎండల కారణంగా చర్మం చాలా నల్లగా మారిపోతుంటుంది.ఎండ వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా( Dark Skin ) మార‌డానికి ప్రధాన కారణం మెలానిన్ ఉత్ప‌త్తి పెర‌గ‌డ‌మే.

 Easily Repair Sun-damaged Hands And Feet At Home Details, Sun Damaged Hands, Su-TeluguStop.com

సూర్యరశ్మిలో( Sun Light ) ఉండే యూవీ కిరణాలు చర్మంపై పడినప్పుడు, అవి చర్మ కణాలను హానిచేస్తాయి.ఆ హాని నుంచి చ‌ర్మాన్ని ర‌క్షించేందుకు బాడీ మెలానోసైట్లు అనే కణాల్లో మెలానిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

దాంతో స్కిన్ డార్క్ గా మారుతుంది.అందుకే చాలామంది బయటకు వెళ్లే ముందు ఎండ ముఖంపై ప‌డ‌కుండా కవర్ చేసుకుంటూ ఉంటారు.

Telugu Badam Oil, Tips, Remedy, Honey, Latest, Skin Care, Skin Care Tips, Sun Da

కానీ చేతులు, పాదాలను పట్టించుకోరు.ఫలితంగా ఎండ దెబ్బకు అవి డార్క్ గా తయారవుతుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే ఇంట్లోనే సులభంగా మరియు వేగంగా ఎండ వల్ల నల్లగా మారిన చేతులను, పాదాలను రిపేర్ చేసుకోవచ్చు.అందుకోసం ముందుకు ఆ ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు వైట్ టూత్ పేస్ట్,( White Tooth Paste ) వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.చివరిగా రెండు నుంచి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Badam Oil, Tips, Remedy, Honey, Latest, Skin Care, Skin Care Tips, Sun Da

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని చేతులకు, పాదాలకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చెక్కతో చేతులను పాదాలను బాగా రుద్దుతూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా త‌డి లేకుండా తుడుచుకుని చేతుల‌కు, పాదాల‌కు మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ రెమెడీతో ఒక్క దెబ్బతోనే ఆల్మోస్ట్ నలుపు మొత్తం క్లియర్ అవుతుంది.

చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

చేతులు, పాదాలు తెల్లగా కాంతివంతంగా మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube