అక్రమంగా అమెరికాలో( America ) నివసిస్తున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరించేందుకు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.తమకు తాముగా ఏరివేత కార్యక్రమంతో పాటు ఎవరైనా దేశం నుంచి తమకు తాము వెళ్లాలనుకుంటే సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా దేశాన్ని వీడాలని సూచిస్తున్నారు అధికారులు.
ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అమెరికా తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.దీంతో భయపడిన పలువురు విదేశీ విద్యార్ధులు( Foreign Students ) సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా అమెరికాను వీడుతున్నారు.
ఇక క్యాంపస్‌లలో నిరసనలు, ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్ధులకు ఇప్పటికే నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే.ఆందోళనల్లో పాల్గొన్నవారే కాకుండా ఈ సంఘటలను వీడియోలు, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన వారు కూడా దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఈ మెయిల్స్ పంపింది.
విద్యార్ధుల గుర్తింపులో సాంకేతికతను కూడా అమెరికా విస్తృతంగా వినియోగిస్తోంది.హమాస్ ఉగ్రవాదులకు మద్ధతుగా నిలుస్తున్న విదేశీ విద్యార్ధులను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)( AI ) టెక్నాలజీ ఉపయోగిస్తోంది.

ఉగ్రవాద అనుకూల పోస్టులకు , స్టోరీలకు సోషల్ మీడియాలో లైక్ చేయడం , షేర్ చేయడం వంటి వాటిపైనా అమెరికా గురి పెట్టింది.అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో నేతృత్వంలో అధికారులు ఈ చర్యలకు దిగారు.జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరించేలా ఆదేశాలు వెళ్లాయి.అయినప్పటికీ సదరు విద్యార్ధులు ఇంకా అమెరికాలో ఉండటంతో వారిని గుర్తించడానికి ట్రంప్ యంత్రాంగం శ్రమిస్తోంది.

అమెరికాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విద్యార్ధులు ఇక్కడ చదువుకునే అవకాశం లేకుండా చేయాలని చేస్తోంది అగ్రరాజ్యం.ఈ మేరకు విదేశాంగ శాఖ , కాన్సులేట్ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటి వరకు లక్ష మందికి పైగా విదేశీయుల ప్రొఫైల్‌లను ఫెడరల్ అధికారులు స్కాన్ చేశారు.రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.