అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి అద్భుత పానీయాలు.. ఇవి డైట్ లో ఉంటే హై బీపీ తో నో టెన్షన్!

అధిక రక్తపోటు( high blood pressure).మనలో ఎంతో మంది అత్యంత సర్వసాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

 These Are Wonderful Drinks For Those Suffering From High Blood Pressure! High Bl-TeluguStop.com

అధిక రక్తపోటును హైపర్ టెన్షన్, హై బీపీ అని కూడా పిలుస్తాము.అధిక రక్తపోటు అనేది అనుకున్నంత చిన్న సమస్య కాదు.

దీని కారణంగా స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె వైఫల్యం, దృష్టి నష్టం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి తదితర జబ్బులన్నీ తలెత్తుతాయి.అందుకే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ఎంతో అవసరం.

అయితే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే పానీయాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.

Telugu Applecider, Beetroot, Pressure, Gingerturmeric, Green Tea, Tips, Bp, Late

ఈ జాబితాలో అల్లం పసుపు టీ ఒకటి.తాజా అల్లం మరియు పసుపు వేసి మరిగించిన వాటర్ రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.అదే సమయంలో బాడీని ఈ డ్రింక్ డీటాక్స్ చేస్తుంది.

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే హై బీపీ తో సతమతం అవుతున్నవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.

ఇది రక్తపోటును అదుపులోకి తెస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Telugu Applecider, Beetroot, Pressure, Gingerturmeric, Green Tea, Tips, Bp, Late

అలాగే గ్రీన్ టీ( Green tea ) డైట్ లో ఉంటే హై బీపీ తో టెన్షన్ అక్కర్లేదు.గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక రక్తపోటు స్థాయిలను సమర్థవంతంగా అదుపులోకి తెస్తాయి.పైగా రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగ‌డం వల్ల వెయిట్ లాస్ అవుతారు.గుండె జ‌బ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మెదడు సైతం చురుగ్గా మారుతుంది.ఇక‌ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి బీట్ రూట్ జ్యూస్ మరొక ఉత్తమ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.

బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, నైట్రేట్స్ మెండుగా ఉంటాయి.ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

అధిక రక్తపోటును తగ్గిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube