కరోనా వైరస్.ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు.అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తుంది.అయితే ప్రస్తుతం ఈ వైరస్ నియంత్రణకు వంటింటి చిట్కాలే మంచి ఔషదాలుగా పని చేస్తున్నాయి.వైద్యులు కూడా ఎంతో మంది ఇంటి వద్దనే వంటింటి చిట్కాలు చక్కగా పని చేస్తాయని సూచిస్తున్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు తాజాగా ఆవిరి చికిత్స ఎంతోమంది ఔషధంగా ఉపయోగపడుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు.
ముంబయిలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వైద్యులు 3 నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్నీ కనుగొన్నారు.ఆ ఆస్పత్రికి చెందిన డా.దిలీప్‌పవార్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరగగా ఆవిరి పట్టిన వారికీ మెరుగైన ఫలితాలు వచ్చినట్టు తెలిపారు.
ఎంతోమంది కరోనా భాదితులు ఈ ఆవిరిని పట్టేందుకు ప్రయోగాలు చెయ్యగా మంచి ఫలితాలు వచ్చాయిట.
లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చిన వారు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.అయితే ఆవిరి పట్టడం అనేది సాధారణంగా జలుబు, దగ్గు వచ్చినప్పుడు చేస్తారు.
కానీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన వారికి కూడా ఈ ఆవిరి చికిత్స అద్బుతంగా పని చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. బ్రీతింగ్ క్యాప్సూల్స్, విక్స్, అల్లం వంటి వాటితో ఆవిరి చికిత్స అద్భుతంగా పని చేస్తుంది.