నల్ల జామ పండ్లు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఆరోగ్యానికి పండ్లు చాలా ఉపయోగపడతాయి.పండ్లలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.

అయితే ప్రతిరోజు పండ్లను తినడం వలన అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు.

అలాంటి పండ్లలో జామ పండు కూడా ఒకటి.

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు జామ పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు.సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఆకుపచ్చ రంగులో ఉండే జామ పండ్ల గురించి మనందరికీ తెలుసు.

కానీ నల్ల జామకాయల గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండదు.సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్లజామ పండు( Black Guava )లో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.

Advertisement

వీటిని తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లజామ పండు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.అంతేకాకుండా ఇది శరీరానికి కూడా చాలా మంచిది.ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి.

అలాగే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి.నల్ల జామ పండ్లను తరచూ తినడం వలన జీర్ణ క్రియ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

అంతేకాకుండా వీటిని తరచూ తినడం వలన మలబద్ధకం, పొట్ట సమస్యల నుండి సులభంగా విముక్తి కలుగుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజూ నల్ల జామ పండ్లను తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.అయితే నల్లజామ పండ్లను తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.దీని వలన తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు.

Advertisement

ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండడంతో వృద్ధాప్యాన్ని కూడా ఇది నివారించడంలో సహాయపడతాయి.ఈ పండును తీసుకోవడం వలన చర్మం పై ఉన్న ముడతలు కూడా తొలగిపోయి, యవ్వనంగా కనిపిస్తారు.

అయితే వీటిని తినాలంటే ఇవి ఇండియాలో మాత్రం లభించవు.ఎక్కువగా ఇవి బ్రెజిల్, సౌత్ అమెరికాలో దొరుకుతాయి.

తాజా వార్తలు