భారతీయులకు వీసా రూల్స్ మార్చిన థాయిలాండ్.. చూడగల బెస్ట్ ప్లేస్‌లు ఇవే

ఇటీవల థాయిలాండ్ ప్రభుత్వం భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్ అందించింది.2024, నవంబర్ 11 వరకు వీసా లేకుండా థాయిలాండ్‌కు వెళ్లే వీలు కల్పించింది.ఈ నిర్ణయంతో తమ దేశానికి ఎక్కువమంది ఇండియన్ టూరిస్ట్ లు వస్తారని, దేశం ఆర్థికంగా బలపడుతుందని థాయిలాండ్ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది.

 Thailand Has Changed The Visa Rules For Indians.. These Are The Best Places To S-TeluguStop.com

వీసా లేకుండా థాయిలాండ్ వెళ్లడం వల్ల భారతీయ పర్యాటకులు ఆ దేశ అందాలను మరింత స్వేచ్ఛగా ఆస్వాదించవచ్చు.

సందడిగా ఉండే వీధులు, మార్కెట్లతో బ్యాంకాక్ బాగా పాపులర్ అయింది కాబట్టి అదొక ప్లేస్ కి వెళ్లాలని చాలామంది అనుకుంటారు కానీ థాయిలాండ్ లో అన్వేషించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.వాటిలో టాప్ ఫైవ్ ప్లేస్ ల గురించి తెలుసుకుందాం.

అయుథ్య: చరిత్ర అంటే ఇష్టం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.థాయిలాండ్( Thailand Ayutthaya Temple ) గత చరిత్రను చెప్పే పురాతన శిథిలాలు, దేవాలయాలు, విగ్రహాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

ఈ పురాతన ప్రదేశాల చుట్టూ తిరుగుతుంటే టైం ట్రావెల్ చేస్తున్న విధంగా అనుభూతి కలుగుతుంది.

Telugu Thailand, Chiang Mai, Indian, Ko Samet, Travel Visa, Visa-Telugu NRI

చియాంగ్ మాయ్

థాయిలాండ్ ఉత్తర ప్రాంతానికి గుండెకాయగా చియాంగ్ మాయ్( Chiang Mai ) నిలుస్తుంది.ఇక్కడ చూపు తిప్పుకోనివ్వని పురాతన దేవాలయాలు ఉన్నాయి.రకరకాల టేస్టీ ఫుడ్స్ కూడా దొరుకుతాయి.

నగరం చుట్టూ తిరగడం, ఖావో సోయి వంటి స్థానిక వంటకాలను రుచి చూడటం లేదా ప్రకృతి పర్యటనలకు వెళ్లడం వంటివి ఇక్కడ చేయవచ్చు.అందమైన దృశ్యాలు, దేవాలయాలతో ఉన్న డోయి ఇన్థానోన్ జాతీయ ఉద్యానవనం కూడా ఇక్కడ ఉంది.

పెచాబురి

సాహసం కోసం చూస్తున్నట్లయితే, పెచాబురి సరైన ప్రదేశం.కోతులు కాపలా కాసే గుహలోని దేవాలయాన్ని సందర్శించవచ్చు.

ఈ ప్రాంతంలో ట్రయల్స్, క్యాంపింగ్ స్పాట్లతో జాతీయ ఉద్యానవనం కూడా ఉంది.

కోహ్ సామెట్

Telugu Thailand, Chiang Mai, Indian, Ko Samet, Travel Visa, Visa-Telugu NRI

బ్యాంకాక్ సమీపంలో ఉన్న కోహ్ సామెట్( Ko Samet ) కూడా చూడదగ్గ ప్రదేశం ఇక్కడి తెల్లటి ఇసుక తీరాలు, స్పష్టమైన నీటితో కూడిన ప్రశాంతమైన ద్వీపం.ఈ ద్వీపం ఈత, సన్‌బాత్ లేదా విశ్రాంతి తీసుకోవడానికి సరైనది.సాయంత్రం వచ్చినప్పుడు, మీరు సీఫుడ్ ఆస్వాదించవచ్చు లేదా బీచ్ బార్‌లలో సరదాగా గడపవచ్చు.

కంచనబురి

Telugu Thailand, Chiang Mai, Indian, Ko Samet, Travel Visa, Visa-Telugu NRI

బ్యాంకాక్ సమీపంలో ఉన్న ఈ గ్రామం రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రకు ప్రసిద్ధి చెందింది.ఇక్కడ పాపులర్ డెత్ రైల్వే, బ్రిడ్జ్‌ను చూడవచ్చు.యుద్ధ ఖైదీలుగా ఉన్న సైనికులకు అంకితమైన మ్యూజియంను సందర్శించవచ్చు.ఈ ప్రాంతంలో అందమైన ఉద్యానవనాలు, జలపాతాలు, గుహలు కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube