ప్రస్తుత వర్షాకాలంలో కొందరు జిడ్డు చర్మంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.వాతావరణంలో తేమ పెరగడం ఇందుకు ప్రధాన కారణం.
అయితే చర్మం జిడ్డుగా మారడం వల్ల మురికి, మృత కణాలు పేరుకు పోతాయి.ఇది మొటిమలకు( acne ) కారణం అవుతుంది.
ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కచ్చితంగా కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలి.మొటిమలను వదిలించి జిడ్డు చర్మాన్ని రిపేర్ చేయడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ వేపాకు రసం, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloe Vera Gel ) వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని మెల్లమెల్లగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.చివరిగా వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ప్రస్తుత వర్షాకాలంలో వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.ముఖ్యంగా ఈ రెమెడీ చర్మం పై అదనపు జిడ్డును తొలగిస్తుంది.చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.మొటిమలకు చెక్ పెడుతుంది.మొటిమలు తాలూకు మచ్చలు ఏమైనా ఉంటే వాటిని మాయం చేస్తుంది.అలాగే ఈ రెమెడీలో వేపాకు మరియు పసుపును వాడడం వల్ల వాటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.
వివిధ రకాల చర్మ సమస్యలను అడ్డుకుంటాయి.నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ( Vitamin C )చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
అలోవెరా జెల్ మరియు గ్లిజరిన్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.ఇక బియ్యం పిండి స్కిన్ ను క్లెన్సింగ్ చేయడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.